గూండాగిరీని ప్రోత్సహిస్తున్నారు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » గూండాగిరీని ప్రోత్సహిస్తున్నారు

గూండాగిరీని ప్రోత్సహిస్తున్నారు

Written By news on Friday, February 6, 2015 | 2/06/2015


గూండాగిరీని ప్రోత్సహిస్తున్నారు
హైదరాబాద్: ఏపీ రాజధానికోసం ఎంపిక చేసిన గ్రామాల్లో సీఎం చంద్రబాబునాయుడు గూండాగిరీని ప్రోత్సహిస్తూ భూములివ్వని రైతులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ధ్వజమెత్తారు. ఆమె గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. సీఆర్‌డీఏ ప్రాంత రైతులు తమ పొలాలివ్వం మొర్రో అని వేడుకుంటున్నా కర్కశంగా వారిని బెదిరించి లాక్కోవాలని టీడీపీ ప్రభుత్వం చూస్తోందని మండిపడ్డారు. ల్యాండ్ పూలింగ్(భూ సమీకరణ) అనే పదం వినడానికి చక్కగా ఉన్నా దాని మాటున జరుగుతున్నదంతా గూండాగిరీయేనన్నారు.

రాజధాని ప్రాంతంలో టీడీపీకి చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, బడా నేతలు భూములను కొనుగోలు చేశారని, అయితే వాటిని రాజధాని నిర్మాణంకోసం తీసుకోండని ఏ ఒక్క నేతా స్వచ్ఛందంగా ఎందుకు ముందుకు రావట్లేదని, సీఎం కూడా తన సొంత పార్టీ నేతలను భూములివ్వాలని ఎందుకు పిలుపునివ్వట్లేదని ఆమె సూటిగా ప్రశ్నించారు. గత నెలలో రాజధాని గ్రామాల రైతులు తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వద్దకొచ్చి ఎలా వేధిస్తున్నదీ తెలిపారన్నారు.

తన పొలాలిస్తారా: రైతు సుధారాణి
ఏటా మూడు పంటలు పండించుకునే తమ భూములను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వబోమని రాజధాని ప్రాంతంలోని కిష్టాయపాలెంకు చెందిన రైతు బోయపాటి సుధారాణి స్పష్టం చేశారు. తమ భూములను లాక్కోవాలని చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలపై ఆమె ఆగ్రహం వెలిబుచ్చుతూ మాట్లాడిన వీడియో క్లిప్పింగ్‌ను వాసిరెడ్డి పద్మ విలేకరుల సమావేశంలో ప్రదర్శించారు. తమ భూములివ్వబోమని ఆయా గ్రామాల్లో రైతులు చేస్తున్న ఊరేగింపులను కూడా వీడియోలో ప్రదర్శించారు.

బాబు మాటల్ని కేంద్రం నమ్మలేదు..
కేంద్రం ఆర్థిక వనరుల వ్యత్యాసం కింద రాష్ట్రప్రభుత్వానికి రూ.500 కోట్లు మాత్రమే ఇచ్చిందని,వెనుకబడిన ప్రాంతాలకు రూ.350 కోట్లు ఇచ్చిందని పద్మ ప్రస్తావిస్తూ.. రాష్ట్రంలో ఆర్థిక లోటు ఉందన్న బాబు మాటలను కేంద్రం నమ్మలేదన్నారు
Share this article :

0 comments: