మీ కోసం పోరాడతా... - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » మీ కోసం పోరాడతా...

మీ కోసం పోరాడతా...

Written By news on Thursday, February 26, 2015 | 2/26/2015


మీ కోసం పోరాడతా...
- న్యాయం జరగకపోతే కలెక్టరేట్ ఎదుట ధర్నా చేస్తాం
- ఓబన్న కుటుంబాన్ని పరామర్శించిన జగన్


అనుంపల్లి (పామిడి): ‘అప్పుల బాధ తట్టుకోలేక ఓబన్న ఆత్మహత్య చేసుకున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం రైతు ఆత్మహత్యగా గుర్తించలేదు. ప్రభుత్వం నుంచి మీకు 5 లక్షల రూపాయల పరిహారం అందాలి. కచ్చితంగా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాం. అవసరమైతే మీతో పాటు జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాల వారందరినీ కలిపి కలెక్టరేట్ ఎదుట పెద్ద ధర్నా చేద్దాం. నేను వచ్చి ధర్నాలో పాల్గొంటా’ అని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఓబన్న కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు. వారిని పరామర్శిస్తూ పంటసాగు, పెట్టుబడి, అప్పులు, ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులను ఆరా తీశారు.  ఓబన్న భార్య సునీతతో జగన్ జరిపిన సంభాషణ ఇలా...
 
 జగన్: పొలం ఎంత ఉందమ్మా? పట్టాదారు పాసుపుస్తకం పెట్టి రుణాలేమైనా తీసుకున్నారా తల్లీ?
 సునీత: రెండెకరాలు ఉంది సార్. ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకులో 30 వేల రూపాయలు తీసుకున్నాం. బయట 1.50 లక్షల అప్పులున్నాయి. బంధువుల వద్ద చేతి బదులుగా రూ. 50 వేల రూపాయలు తెచ్చుకున్నాం సార్.
 
 జగన్: ప్రభుత్వ అధికారులు ఏమైనా ఇంటి దగ్గరికి వచ్చారామ్మా?
 సునీత: ఎవ్వరూ రాలేదు సార్. ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి రూపాయి కూడా రాలేదు సార్
 జగన్: చంద్రబాబు ప్రభుత్వం వచ్చి 9 నెలలవుతోంది. ఆదుకోవాలనే ఆలోచన ఉండి మీకు పరిహారం ఇవ్వాలంటే ఇవ్వొచ్చమ్మా. కానీ ఇవ్వలేదు. ఇప్పటికైనా ఇస్తే మంచిది. లేదంటే అసెంబ్లీ సమావేశాల తర్వాత కలెక్టరేట్ వద్ద ధర్నా చేపడతాం. నేనూ కూడా వస్తా.
 ఇప్పుడు నేను రావడంతో మీకు జరిగిన అన్యాయం రాష్ట్రమంతా తెలుస్తుంది. మీకు మంచి జరుగుతుందనే ఉద్దేశంతోనే వచ్చా తల్లీ. ఏం భయపడొద్దు. ధైర్యంగా ఉండండి. ఏమన్నా ఉంటే వెంకట్రామిరెడ్డితో పాటు మన పార్టీ జిల్లా నేతలు అంతా అండగా ఉంటారు. పిల్లలను బాగా చదివించుకోవాలమ్మా.. బాగా చదివించుకుంటే అదే మనకు పెద్ద ఆస్తి. ధైర్యంగా ఉండండి.
Share this article :

0 comments: