www.ysrcongress.net :
Home » » వైఎస్సార్‌సీపీయే పోలీసుల టార్గెట్

వైఎస్సార్‌సీపీయే పోలీసుల టార్గెట్

Written By news on Wednesday, February 11, 2015 | 2/11/2015


వైఎస్సార్‌సీపీయే పోలీసుల టార్గెట్పోలీసులు అదుపులోకి తీసుకున్న యువకులు
వాహనాల దహనం కేసులో 10 మంది అరెస్టు
 
తాడేపల్లి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీయే లక్ష్యంగా పోలీసులు వ్యవహరిస్తున్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లి పట్టణ, మండల పరిధిలో ఏం జరిగినా పార్టీ కార్యకర్తలు, సానుభూతిపరులనే అదుపులోకి తీసుకుంటూ.. విచారణ పేరుతో సంబంధం లేని ప్రశ్నలు వేస్తూ ఇబ్బందులు పెడుతున్నారు. కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేయడం ద్వారా.. వారు పార్టీలో తిరగకుండా చేసేందుకే ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారని స్థానిక యువకులు అంటున్నారు.

తాడేపల్లి పట్టణ పరిధిలో సోమవారం తెల్లవారుజామున వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులకు చెందిన కొన్ని ద్విచక్ర వాహనాలను గుర్తుతెలియని వ్యక్తులు దహనం చేశారు. వీరంతా రాజధానికి భూములు ఇచ్చేందుకు నిరాకరించినవారే. అరుుతే ఈ  కేసులో పోలీసులు నులకపేటకు చెందిన పదిమంది యువకులను మంగళవారం ఉదయం అదుపులోకి తీసుకున్నారు. వీరంతా వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులే కావడం గమనార్హం.

పగలంతా కష్టపడి ఇళ్ళల్లో నిద్రిస్తున్న సమయంలో పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చి, విచారణ పేరుతో తమ మెడలో పలకలు వేసి, ఫొటోలు తీయిస్తున్నారని బాధితులు వాపోతున్నారు. ఇప్పటికైనా పోలీసులు వైఎస్సార్‌సీపీ పార్టీవారినే టార్గెట్ చేయకుండా కేసును అన్ని కోణాల్లో విచారించాలని కోరుతున్నారు.
Share this article :

0 comments: