ఒకేసారి.. రెండు అసెంబ్లీల సమావేశం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఒకేసారి.. రెండు అసెంబ్లీల సమావేశం

ఒకేసారి.. రెండు అసెంబ్లీల సమావేశం

Written By news on Friday, February 27, 2015 | 2/27/2015


ఒకేసారి.. రెండు అసెంబ్లీల సమావేశం
హైదరాబాద్ : చరిత్రలో ఒకేసారి ఒకే అసెంబ్లీ ప్రాంగణంలో రెండు రాష్ట్రాల అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. మార్చి 7వ తేదీ నుంచి ఏపీ, తెలంగాణ రాష్ట్రాల అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. దీనికోసం ముందుగా వచ్చేనెల 4వ తేదీన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల అసెంబ్లీ స్పీకర్లు, మండలి ఛైర్మన్ల ఉమ్మడి సమావేశం నిర్వహిస్తున్నారు.

గేట్-1 నుంచి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులను అనుమతించాలని పోలీసు అధికారులు అభిప్రాయపడ్డారు. అలాగే గేట్-2 నుంచి రెండు రాష్ట్రాలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అనుమతించాలని భావించారు. ఇలా ఇప్పటివరకు ఎప్పుడూ ఒకేసారి ఒకే సమయంలో రెండు రాష్ట్రాల అసెంబ్లీ సమావేశాలు ఒకే భవనంలో జరిగిన దాఖలాలు లేవు.
Share this article :

0 comments: