అండగా ఉంటా! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » అండగా ఉంటా!

అండగా ఉంటా!

Written By news on Thursday, February 12, 2015 | 2/12/2015


అండగా ఉంటా!
అంగన్‌వాడీ, డ్వాక్రా మహిళలతో ప్రతిపక్షనేత
పరామర్శలు..శుభకార్యాలలో బిజీబిజీ
శంఖవరం ఆలయ స్థలాల పరిరక్షణకు వినతి
కౌన్సిలర్ల కష్టసుఖాలను అడిగి తెలుసుకున్న జగన్
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు,ఇతర నేతలతో చర్చ

 

సాక్షి, కడప/పులివెందుల : డ్వాక్రా మహిళలు, అంగన్‌వాడీ కార్యకర్తల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం పులివెందులలో ఆయనను కలిసిన డ్వాక్రా మహిళలు, అంగన్‌వాడీ వర్కర్లు తమ కష్టాలు వినిపించారు. 13నెలలుగా టీఏ బిల్లులు రాలేదని.. 8నెలలుగా అంగన్‌వాడీ భవనాలకు అద్దె బిల్లులు కూడా ఇవ్వలేదని వైఎస్ జగన్‌కు వివరించారు. మున్సిపాలిటీలో ప్రభుత్వం ప్రకటించిన ప్రకారం ఒక్కొక్క అంగన్‌వాడీ కేంద్రానికి రూ.3వేలు ఇవ్వాలని.. రెండు నెలలుగా అంగన్‌వాడీ వర్కర్లకు జీతాలు ఇవ్వకుండా సీడీపీవో వేధిస్తున్నారని వారు వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పటికే వారం రోజులుగా ఆందోళన చేస్తున్నామని.. కలెక్టర్, ఇతర అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకపోరుుందన్నారు. వారి కష్టాలన్నీ విని చలించిపోరుున జగన్‌మోహన్‌రెడ్డి తాను అండగా ఉంటానని, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఓదార్చారు. అప్పటికప్పుడే సంబంధిత అధికారిణితో మాట్లాడారు. పది రోజుల్లో సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

నిండు నూరేళ్లు చల్లగా వర్ధిల్లండి.. :

బుధవారం 10.15 గంటల ప్రాంతంలో పులివెందులకు చేరుకున్న ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేరుగా పలు వివాహాలకు హాజరయ్యారు. ముందుగా పార్నపల్లె రోడ్డులోని సాయిబాబా ఆలయంలో జరుగుతున్న వ్యక్తిగత సిబ్బందిగా పనిచేస్తున్న గంగరాజు వివాహానికి హాజరై ఆశీర్వదించారు. అనంతరం తొండూరులోని టీటీడీ కళ్యాణ మండపంలో జరుగుతున్న కాంబల్లెకు చెందిన రామకృష్ణారెడ్డి కుమారుడు గంగాధర రెడ్డి, అనూషల వివాహ మహోత్సవానికి హాజరయ్యూరు. అనంతరం ఇటీవల వివాహం అరుున వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా కార్యదర్శి బండి రమణారెడ్డి కుమారుడు శ్రీకాంత్‌రెడ్డి, హరితలను ఆశీర్విదించేందుకు  తేలూరు తుమ్మలపల్లెలోని వరుని ఇంటికి వెళ్లి నిండు నూరేళ్లు చల్లగా వర్థిల్లాలని ఆశీర్వదించారు.

అనంతరం గ్రామంలో ఉన్న వైఎస్‌ఆర్ సీపీ నాయకుడు బండి శ్రీనివాసులరెడ్డిని పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని వైఎస్ జగన్‌రెడ్డి అడిగి తెలుసుకున్నారు. .అనంతరం నేరుగా పులివెందులకు చేరుకుని కడప రోడ్డులో ఉన్న విజయా హోమ్స్‌లో కాంట్రాక్టర్ వై.నారాయణరెడ్డి గృహ ప్రవేశ కార్యక్రమానికి హాజరయ్యారు. రెండు రోజుల క్రితం వివాహమైన వేముల ఎంపీడీవో రాజశేఖరరెడ్డి కుమార్తె సాగర్మ్య్ర, అరుణ్‌రెడ్డి దంపతులను ఇంటికెళ్లి ఆశీర్వదించారు.

ఆ సమీపంలోనే ఉన్న డాక్టర్ రవీంద్రారెడ్డి ఇంటికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిసి కుశల ప్రశ్నలు అడిగారు. తర్వాత పులివెందులలోని సుజాత హాలు సమీపంలో నివసిస్తున్న మురారిచింతల మాజీ సర్పంచ్ ఓబుళరెడ్డి కుమారుడు, నూతన దంపతులైన శశిధర్‌రెడ్డి, జయలను, చెక్క డిపో హరి కుమార్తె కృష్ణవేణి, అల్లుడు అనంద్‌కుమార్‌లకు శుభాకాంక్షలు తెలియజే శారు. అలాగే సింహాద్రిపురం మండల వైఎస్‌ఆర్ సీపీ నాయకుడు రామగిరి జనార్థన్‌రెడ్డి సోదరుడి కుమారుడు దామోదర్‌రెడ్డి, శాంతిల దంపతులను ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితోపాటు కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి ఆశీర్వదించారు.

వైఎస్ జగన్‌పై పూలవర్షం :
ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌రెడ్డి తణుకులో దీక్షను విజయవంతమైన నేపధ్యంలో పులివెందులలో ఘన స్వాగతం లభించింది. శ్రీరామాహాలు రోడ్డులో నివసిస్తున్న కౌన్సిలర్ కోడి రమణ ప్రత్యేకంగా వైఎస్ జగన్ కాన్వాయ్ రాగానే భారీ ఎత్తున బాణా సంచా పేల్చుతూ స్వాగతం పలికారు. అంతేకాకుండా గజమాల వేసి వైఎస్ జగన్‌పై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. అక్కడ నుంచి ఇతర వివాహ కార్యక్రమాలకు వెళుతున్న వైఎస్ జగన్‌పై పూల వర్షం కురిపిస్తూ.. భారీగా ముందుకు కదిలారు.

కౌన్సిలర్లతో కాసేపు :

పులివెందులలోని కడప రోడ్డులో ఉన్న విజయా హోమ్ వద్ద మున్సిపల్ చైర్ పర్సన్ వైఎస్ ప్రమీలమ్మ, మున్సిపల్ మాజీ వైస్ చెర్మైన్ వైఎస్ మనోహర్‌రెడ్డి, వైస్ చెర్మైన్ చిన్నప్పలతోపాటు కౌన్సిలర్లతో చర్చించారు. ప్రధానంగా వారికి ఎదురవుతున్న సమస్యలు, ప్రస్తుత పరిస్థితులు ఇతర అంశాలను అడిగి తెలుసుకున్నారు. కలిసికట్టుగా పార్టీ కోసం కష్టపడాలని.. భవిష్యత్‌లో మంచి రోజులు రానున్నాయని వారికి భరోసా ఇచ్చారు.

శంఖవరం ఆలయ స్థలాలను పరిరక్షించండి :

కలసపాడు మండలం శంఖవరం గ్రామంలో ఉన్న చెన్నకేశవ, ఆంజనేయస్వామి, వీరభద్రస్వామి, శివాలయం తదితర ఆలయాలకు సంబంధించిన స్థలాలను పరిరక్షించాలని ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌రెడ్డికి గ్రామానికి చెందిన ఉద్దండం శివప్రసాద్ విజ్ఞప్తి చేశారు. ఆలయ పరిసర ప్రాంతాలతోపాటు ఆలయ మాన్యం భూములలో పశువులతోపాటు గడ్డి వాములు వేసి ఆక్రమించుకున్నారని.. దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని వైఎస్ జగన్‌ను కోరారు. ఆలయాలకు సంబంధించిన స్థలాన్ని ఆక్రమించుకుంటున్న వారిపై కఠిన చర్యలు తీసుకునేలా అధికారులపై ఒత్తిడి తెస్తామని శివప్రసాద్‌కు వైఎస్ జగన్ హామీ ఇచ్చారు.

వైఎస్ జగన్‌ను కలిసిన పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు


పులివెందులలో ఉన్న ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని పలువురు వైఎస్‌ఆర్‌సీపీ నేతలు కలిశారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డితోపాటు రైల్వేకోడూరు, కదిరి ఎమ్మెల్యేలు కొరముట్ల శ్రీనివాసులు, అత్తార్ చాంద్ బాషా, వైఎస్‌ఆర్ సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథరెడ్డి, ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, డీసీసీబీ చెర్మైన్ ఇరగంరెడ్డి తిరుపాల్‌రెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు ఇ.వి.మహేశ్వరరెడ్డి, నిమ్మకాయల సుధాకర్‌రెడ్డి, ఎన్‌ఎస్‌పీ కన్‌స్ట్రక్షన్స్ అధినేత నర్రెడ్డి శివప్రకాష్‌రెడ్డి తదితరులు వైఎస్ జగన్‌ను కలిసి  చర్చించారు.
Share this article :

0 comments: