
ఈ నెల 22న హిందూపురం నియోజకవర్గం నుంచి ప్రారంభమైన యాత్ర పుట్టపర్తి, ఉరవకొండ, శింగనమల, గుంతకల్లు నియోజకవర్గాల్లో సాగింది. ఐదు రోజుల్లో 781 కిలోమీటర్లు ప్రయాణించిన జగన్.. ఆత్మహత్య చేసుకున్న 11 మంది రైతుల కుటుంబాలను పరామర్శించారు. హిందూపురం నియోజకవర్గం చిలమత్తూరు మండలం కొడికొండ చెక్‌పోస్టు వద్ద మొదలైన యాత్ర గురువారం సాయంత్రం పామిడి మండలం రామరాజుపల్లితో ముగిసింది. ఐదో రోజు యాత్రలో భాగంగా ఉదయం 9.50 గంటలకు జగన్ పామిడి వీరాంజనేయులు అతిథి గృహం నుంచి బయలుదేరారు. పి. కొండాపురం చేరుకుని సుంకమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న రైతు కే. శివారెడ్డి(46) కుటుంబాన్ని పరామర్శించారు. గ్రామస్తులు జగన్‌కు ఘన స్వాగతం పలికారు. రోడ్లపై బంతిపూలు పరిచారు. మహిళలు హారతులు పట్టారు. అనంతరం అక్కడి నుండి రామరాజుపల్లికి చేరుకున్నారు. పామిడి- గుత్తి హైవేకు సమీపంలోని గ్రామాల ప్రజలు జగన్‌ను చూసేందుకు రోడ్డుపైకి వచ్చారు. అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ రావడంతో చివరి రోజు పర్యటన 4 గంటలు ఆలస్యంగా సాగింది. మధ్యాహ్నం 2 గంటలకు కార్యక్రమం ముగించాలని షెడ్యూలు ఉంటే సాయంత్రం 6 గంటల దాకా సాగింది. రామరాజుపల్లిలో రైతులతో జగన్ చర్చా వేదిక నిర్వహించారు. రైతు భరోసా యాత్ర ఎందుకు చేపట్టాల్సి వచ్చింది.. ప్రభుత్వం చేసిన మోసాలు తదితర అంశాలను జగన్ వివరించారు. ప్రభుత్వంతో తాము ఎలా మోసపోయామో రైతులు జగన్‌కు ససాక్ష్యాలతో వివరించారు. రుణమాఫీపై ఆశపడ్డామని, అయితే చంద్ర బాబు వైఖరి చూసి తాము మోసపోయామని తెలుసుకున్నామని చెప్పారు. ఇకపై మీతోపాటు నడుస్తున్నామని, తమకు అండగా ఉండాలని జగన్‌కు రైతులు విన్నవించారు. రైతులకు జరిగిన అన్యాయంపై ఉద్యమం ఆగదని, ‘అనంత’ రైతుల సమస్యలపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తానని భరోసా ఇచ్చారు. అనంతరం గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న రైతు పుల్లారెడ్డి (64)కుటుంబాన్ని పరామర్శించారు. అక్కడి నుండి హైదరాబాద్‌కు పయనమయ్యారు.
జగన్‌కు వీడ్కోలు పలికిన ‘అనంత’ నేతలు:
తొలి విడత యాత్ర ముగిసిన తర్వాత జగన్‌కు జిల్లా నేతలు జిల్లా సరిహద్దులో వీడ్కోలు పలికారు. ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంత వెంకట్రామిరెడ్డి, గుంతకల్లు నియోజకవర్గ సమన్వయకర్త వెంకట్రామిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు శంకర్‌నారాయణ, ఎమ్మెల్యే అత్తార్ చాంద్‌బాషా, సీజీసీ సభ్యుడు బి. గురునాథరెడ్డి, ప్రోగ్రాం కోఆర్డినేటర్ తలశిల రఘురాం తదితరలు వీడ్కోలు పలికారు. ఐదో రోజు యాత్రలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఆలూరు సాంబశివారెడ్డి, తాడిపత్రి సమన్వయకర్తలు రమేశ్‌రెడ్డి, వీఆర్ రామిరెడ్డి, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వజ్ర భాస్కర్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు ఎల్‌ఎం మోహన్‌రెడ్డి, రాష్ట్ర సహాయ కార్యదర్శులు నదీమ్ అహ్మద్, మీసాల రంగన్న, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు బండి పరశురాం, రాష్ట్ర కార్యదర్శి నరేంద్ర, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు బోయ సుశీలమ్మ, ప్రధాన కార్యదర్శి ఉష, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకటచౌదరి, ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఆదినారాయణరెడ్డి, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు, సిద్దారెడ్డి, పెన్నోబులేసు, జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్ రవీంద్రారెడ్డి, గువ్వల శ్రీకాంత్‌రెడ్డి, ఆనందరెడ్డి, మహిళా విభాగం నగర అధ్యక్షురాలు శ్రీదేవి, యువజన విభాగం నగర అధ్యక్షుడు మారుతీ నాయుడు, పసుపుల బాలకృష్ణారెడ్డి, ప్రమీల, కృష్ణవేణి, తదితరులు పాల్గొన్నారు.
ప్రజలకు ధన్యవాదాలు : శంకర్‌నారాయణ, జిల్లా అధ్యక్షుడు,
రైతులు, ప్రజలు కష్టాలను తెలుసుకుని మోసం చేసిన ప్రభుత్వం మెడలు వంచేందుకే ఈ యాత్ర చేపట్టాం. మొదటి విడత యాత్ర దిగ్విజయంగా ముగిసింది. యాత్ర విజయవంతమవడానికి సహకరించిన నేతలు, కార్యకర్తలకు ధన్యవాదాలు. రెండో విడత యాత్రలో తక్కిన రైతు కుటుంబాలను జగన్ పరామర్శిస్తారు.
0 comments:
Post a Comment