చంద్రబాబు కాదు.. దుబారా బాబు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » చంద్రబాబు కాదు.. దుబారా బాబు

చంద్రబాబు కాదు.. దుబారా బాబు

Written By news on Wednesday, February 4, 2015 | 2/04/2015


చంద్రబాబు కాదు.. దుబారా బాబు
 వైఎస్సార్‌సీపీ నేత అంబటి ధ్వజం
 ఆర్థిక పరిస్థితి బాగో లేదంటూనే  ప్రజాధనం వృథా చేస్తున్నారు

 
 సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని ఓ వైపు చెబుతూనే మరోవైపు ప్రజాధనాన్ని దుబారా చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు అంబటి రాంబాబు ధ్వజమెత్తారు.  ప్రజాధనాన్ని ఇష్టానుసారం ఖర్చు పెట్టడం చూస్తే ఆయన చంద్రబాబు కాదు, దుబారా బాబు అనిపిస్తోందని విమర్శించారు.  విభజన వల్ల తీవ్రంగా నష్టపోయామని, రాజధాని ఏర్పాటుకు, రాష్ట్ర పునర్నిర్మాణానికి డబ్బులు లేవని చంద్రబాబు ముఖ్యమంత్రి గద్దెనెక్కిన నాటినుంచీ చెబుతూనే ఉన్నారన్నారు.
 
 ఐఏఎస్‌తో సహా అందరు అధికారులు, మంత్రులు తమ ఖర్చులు తగ్గించుకోవాలని, ఆర్థిక క్రమశిక్షణ పాటించాలంటూ గత ఏడాది జూలైలో జీవోలు కూడా ఇచ్చారన్నారు. అలాగే రాజధాని నిర్మాణానికి హుండీలు పెట్టించడం, విరాళాలివ్వండని విజ్ఞప్తి చేయడం వంటివీ చేశారని చెప్పారు. పొదుపు చర్యలు పాటించాలని జీవోలిచ్చిన చంద్రబాబు తానే స్వయంగా వాటిని ఉల్లంఘిస్తూ దుబారా ఖర్చులకు పాల్పడ్డం చూస్తే ‘ఎదుటి వాళ్లకు చెప్పేటందుకే నీతులు ఉన్నాయి...’ అన్నట్లుగా ఉందని అంబటి ఎద్దేవా చేశారు.
 
 మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ఢిల్లీ వెళ్లడానికి అనేక విమానాలుండగా.. చంద్రబాబు తన తాబేదార్లతో కలిసి చార్టర్డ్ ఫ్లైట్‌లలో భారీ మొత్తం చెల్లించి ప్రత్యేకంగా వెళ్లడం సబబేనా? గతంలో ఏ సీఎం ఢిల్లీకి ప్రత్యేక విమానాలు వేసుకుని వెళ్లిన సందర్భాలున్నాయా? గతంలో ఏదైనా ప్రత్యేక సందర్భంలో సీఎంలు అలా వెళ్లారేమో గానీ, చంద్రబాబులాగా పదే పదే అద్దె విమానాలకు ప్రజాధనాన్ని భారీ మొత్తంలో చెల్లించి వెళ్లలేదు.
 
 ఒక్క ఢిల్లీకే కాదు, హైదరాబాద్ నుంచి తిరుపతి, విశాఖపట్నం, విజయవాడకు కూడా చంద్రబాబు తన వందిమాగధులతో కలసి ప్రత్యేక విమానాల్లో వెళ్లడం ఏమిటి? అధికారులను విమానం ఎగ్జిక్యూటివ్ క్లాసులో కాకుండా ఎకానమీ క్లాసులో వెళ్లాల్సిందిగా చెబుతున్న చంద్రబాబు తాను మాత్రం ప్రత్యేక విమానాల్లో వె ళ్లడం సమంజసమా? ఇక సింగపూర్, జపాన్ పర్యటనలకు ప్రత్యేక విమానాల్లో వెళ్లి వచ్చినందుకు ఒకసారి రూ.70 లక్షలు, మరోసారి రూ.1.25 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. అయితే ఆ పర్యటనలకు అయిన అసలు ఖర్చు ఎంత అనేది దాచి పెట్టారు.
 
 పొదుపు పాటించడం అంటే ఇలా దుబారా చేయడమేనా?’ అని ప్రశ్నించారు.13 జిల్లాలతో ఉన్న ఏపీకి 15 మంది సలహాదారులను నియమించడం ఎంతవరకు సబబు అని అన్నారు. యోగా శిక్షణ కోసం రూ.2 కోట్లు ఖర్చు చేయడంలో ఔచిత్యాన్ని ఆయన ప్రశ్నించారు. దుబారా చేస్తూనే.. ఆర్థిక పరిస్థితి బాగో లేదని పదే పదే చె ప్పడం, ఉద్యోగుల పీఆర్సీని ఎగ్టొట్టేందుకేనని స్పష్టమవుతోందని అంబటి అన్నారు.
 
Share this article :

0 comments: