టీడీపీ పోటీ చేస్తే డిపాజిట్లు దక్కవు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » టీడీపీ పోటీ చేస్తే డిపాజిట్లు దక్కవు

టీడీపీ పోటీ చేస్తే డిపాజిట్లు దక్కవు

Written By news on Thursday, February 26, 2015 | 2/26/2015

అనంతపురం : ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ రెండోసారి పోటీచేసి 70కి 67 స్థానాల్లో గెలిచి ఘనవిజయం సాధించిందని, అదే మన రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా టీడీపీకి డిపాజిట్లు కూడా దక్కవని వైఎస్ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎద్దేవా చేశారు. అనంతపురంలో రైతు ఐదో రోజు భరోసా యాత్రలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు మాటలు నమ్మి రైతులు రుణాలు కట్టలేదని, దాంతో వారిపై వడ్డీభారం రూ. 12 వేల కోట్లు పడిందని, దీనంతటికీ కారణం బాబేనని చెప్పారు. రుణాలు మాఫీ కాకపోవడంతో డ్వాక్రా మహిళలు ఆందోళనలో ఉన్నారని, డ్వాక్రా మహిళల పొదుపు సొమ్మును బ్యాంకులు రుణాల ఖాతాలకుజమ చేసుకుంటున్నాయని వైఎస్ జగన్ ఆందోళన వ్యక్తం చేశారు.

రైతులకు రూ. 57 వేల కోట్ల రుణాలు ఇవ్వాలని బ్యాంకర్లు లక్ష్యంగా పెట్టుకున్నారని, కానీ రుణాలు మాఫీ కాకపోవడంతో కేవలం రూ. 13 వేల కోట్లే ఇచ్చారని చెప్పారు. రైతన్నలు నూటికి 2, 3 రూపాయల వడ్డీకి అప్పులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. రైతుల రుణాలు రెన్యువల్ కాలేదని, దాంతో వారికి క్రాప్ ఇన్సూరెన్స్ దక్కలేదని చెప్పారు. ఏపీలో గత సీజన్ లో వర్షాలు 36 శాతం తక్కువగా నమోదయ్యాయని, కరువు వచ్చినా చంద్రబాబు మాత్రం స్పందించరని మండిపడ్డారు. హంద్రీనీవాకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి రూ. 5,800 కోట్లు ఖర్చుచేస్తే, చంద్రబాబు కేవలం రూ. 13కోట్లే ఖర్చుపెట్టారని గుర్తుచేశారు.
Share this article :

0 comments: