పెట్రోల్ ధరలు తగ్గించకుంటే పోరాటమే: మాజీ ఎమ్మెల్యే కాపు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » పెట్రోల్ ధరలు తగ్గించకుంటే పోరాటమే: మాజీ ఎమ్మెల్యే కాపు

పెట్రోల్ ధరలు తగ్గించకుంటే పోరాటమే: మాజీ ఎమ్మెల్యే కాపు

Written By news on Sunday, February 8, 2015 | 2/08/2015


పెట్రోల్ ధరలు తగ్గించకుంటే పోరాటమే: మాజీ ఎమ్మెల్యే కాపు
అనంతపురం: విద్యుత్, పెట్రోల్ ధరలు తగ్గించకపోతే పోరాటాలు తీవ్రతరం చేస్తామని రాయదుర్గం మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి హెచ్చరించారు. ఎన్నికల హామీల అమలులో సీఎం చంద్రబాబు నాయుడు విఫలమయ్యారని ఆయన విమర్శించారు. ఆదివారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడారు.
పెట్రోల్ పై వ్యాట్ విధించిన ఘనత చంద్రబాబుకే దక్కిందని ఆయన అన్నారు. విద్యుత్ ఛార్జీల పెంపు సామాన్యుల పాలిట శాపమైందని కాపు ఎద్దేవా చేశారు. రైతన్నలు ఆత్మహత్యలు చేసుకోవద్దని.. వైఎస్ జగన్ నేతృత్వంలో సమస్యలు పరిష్కిరంచుకుందామని కాపు రామచంద్రారెడ్డి అన్నారు.
Share this article :

0 comments: