రాజధాని ప్రయోజనాలు రైతుకు దక్కనీయరా? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రాజధాని ప్రయోజనాలు రైతుకు దక్కనీయరా?

రాజధాని ప్రయోజనాలు రైతుకు దక్కనీయరా?

Written By news on Tuesday, February 24, 2015 | 2/24/2015

రాజధాని నిర్మాణం వల్ల ఆ ప్రాంతంలోని భూములకు విలువ పెరిగితే ఆ ప్రయోజనాలు రైతులకే దక్కాలని, ప్రైవేటు కంపెనీలకు కాదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్షం స్పష్టం చేసింది. రైతుల భూమి తీసుకొని ప్రైవేటు కంపెనీలకు ఇచ్చి వ్యాపారం చేయడాన్ని తాము ఒప్పుకోబోమని తేల్చి చెప్పింది. ఈ మేరకు సోమవారం రాజధాని ప్రాంతంలో పర్యటించిన వైఎస్సార్ సీపీ శాసనసభా పక్షం అక్కడి రైతులు, రైతు కూలీలు, చేతివృత్తుల వారి ఇబ్బందులు తెలుసుకుంది. అనంతరం విజయవాడ చేరుకుని పర్యటనలో తమకు అందిన సమస్యలపై సీఆర్‌డీఏ కమిషనర్ శ్రీకాంత్‌కు వినతిపత్రం సమర్పించింది. తర్వాత పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు మీడియాతో మాట్లాడుతూ.. తుళ్లూరులో రాజధాని నిర్మాణానికి తమ పార్టీ వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. ఆ ప్రాంతంలో కోర్ క్యాపిటల్‌కు 2 వేల ఎకరాలు తీసుకుని మిగిలిన భూములను రైతులకే వదిలేయాలని సూచించారు. ప్లాన్ ప్రకారం పారిశ్రామిక, వ్యాపార జోన్లను విభజించాలని, అవి అభివృద్ధి చెందితే ఆ భూములను రైతులే అమ్ముకుని లాభం పొందుతారని తెలిపారు. వైఎస్సార్ సీపీ అధినేత జగన్ గతంలోనే అసెంబ్లీలో ప్రభుత్వానికి ఈ సూచన చేశారని ధర్మాన గుర్తు చేశారు. అంతకుముందు సీఆర్‌డీఏ కమిషనర్ శ్రీకాంత్‌కు పలు సమస్యలను వివరిస్తూ.. పంటలు వేసుకోవద్దని చెప్పడం సబబు కాదన్నారు. అయితే, అంగీకారపత్రాలు ఇచ్చిన రైతులకే అది వర్తిస్తుందని శ్రీకాంత్ సమాధానమిచ్చారు. రైతులిచ్చే అభ్యంతర పత్రాలను డెప్యూటీ కలెక్టర్లు తీసుకోవడంలేదని చెప్పగా.. అలా ఉండదని వాటిని తీసుకుంటారని శ్రీకాంత్ వివరించారు.
 
కాగా, సీఆర్‌డీఏ కమిషనర్‌ను కలసిన వారిలో ఎమ్మెల్యేలు ఆళ్ల రామకృష్ణారెడ్డి, కోన రఘుపతి, జయరాములు, రఘురామిరెడ్డి, అశోక్‌రెడ్డి, ఆదిమూలపు సురేష్, రాజన్నదొర, సుజయకృష్ణ రంగారావు, రక్షణనిధి, పాలపర్తి డేవిడ్‌రాజు, అంజాద్ భాషా, వెంకటరెడ్డి, అనిల్‌కుమార్ యాదవ్, కాకాని గోవర్ధన్  రెడ్డి, రామిరెడ్డి ప్రతాప్‌కుమార్ రెడ్డి, కిలివేటి సంజీవయ్య, ఉప్పులేటి కల్పన, గిడ్డి ఈశ్వరి, ఎమ్మెల్సీలు మేకా శేషుబాబు, ఆదిరెడ్డి అప్పారావు, నాయకులు పార్థసారధి, అంబటి రాంబాబు, మేకా ప్రతాప్ అప్పారావు, గుంటూరు జిల్లా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ తదితరులు ఉన్నారు.
Share this article :

0 comments: