బాబు సీఎం అయినా సిద్ధప్ప రుణం మాఫీ కాలేదే - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » బాబు సీఎం అయినా సిద్ధప్ప రుణం మాఫీ కాలేదే

బాబు సీఎం అయినా సిద్ధప్ప రుణం మాఫీ కాలేదే

Written By news on Sunday, February 22, 2015 | 2/22/2015


'బాబు సీఎం అయినా సిద్ధప్ప రుణం మాఫీ కాలేదే'వీడియోకి క్లిక్ చేయండి
అనంతపురం: ఎన్. చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యాడు కాని రైతులు రుణాల మాత్రం మాఫీ కాలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోపించారు. సీఎంగా బాధ్యతలు చేపట్టగానే రైతుల రుణాలు మాఫీ చేస్తానని ఎన్నికల నేపథ్యంలో హామీ ఇచ్చిన చంద్రబాబు..  ఆ తర్వాత ఆ మాట మరిచారని ఆయన విమర్శించారు. రైతు భరోసా యాత్రలో భాగంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదివారం అనంతపురం జిల్లా హిందూపురంలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ చంద్రబాబు వైఖరిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా రుణ మాఫీ కాకపోవడంతో ఆత్మహత్య చేసుకున్న రైతు సిద్ధప్ప విషయాన్ని వైఎస్ జగన్ ఈ సందర్బంగా ప్రస్తావించారు.

చంద్రబాబు సీఎం అయితే తన రుణం మాఫీ అవుతుందని సిద్ధప్ప ఆశపడ్డాడు. కానీ బాబు సీఎం అయ్యాడు కాని సిద్ధప్ప రుణం మాత్రం మాఫీ కాలేదని అన్నారు. సిద్దప్ప తాకట్టు పెట్టిన బంగారం వేలం వేస్తామని బ్యాంక్ అధికారులు నోటీసులు పంపారు. ఓ వైపు పంట పండకపోవడం మరోవైపు తీసుకున్న రుణం మాఫీ కాకపోవడంతో సిద్ధప్ప తీవ్ర వేదన చెంది ఆత్మహత్య చేసుకున్నారని వైఎస్ జగన్ వివరించారు.  సిద్ధప్ప చనిపోతే అధికారులు కనీసం ఆతడి ఇంటికి కూడా వెళ్లలేదని గుర్తు చేశారు. రైతు సిద్ధప్ప ఆత్మహత్యే చేసుకోలేదని చంద్రబాబు ప్రభుత్వం ప్రకటించిందని జగన్ తెలిపారు. బాబు అధికారంలోకి వచ్చిన ఎనిమిది నెలల కాలవ్యవధిలో సిద్ధప్పలాంటి 46 మంది రైతులు అనంతపురంలో ఆత్మహత్య చేసుకున్నారని వైఎస్ జగన్ విశదీకరించారు.

అన్నదాతల్లో భరోసా కల్పించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆదివారం అనంతపురం జిల్లాలో 'రైతు భరోసా యాత్ర'ను ప్రారంభించారు.  అందులోభాగంగా లేపాక్షి మండలంలోని మామిడిమాకులపల్లిలో వ్యవసాయం గిట్టుబాటు కాక ఆత్మహత్య చేసుకున్న వెనుకబడిన వర్గాలకు చెందిన రైతు కురుబ సిద్ధప్ప కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శించారు. ఆదివారం నుంచి ఐదు రోజుల పాటు వైఎస్ జగన్ అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు.
Share this article :

0 comments: