వైఎస్ జగన్ సమాధానంతో ఇరకాటంలో టీడీపీ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్ జగన్ సమాధానంతో ఇరకాటంలో టీడీపీ

వైఎస్ జగన్ సమాధానంతో ఇరకాటంలో టీడీపీ

Written By news on Wednesday, March 25, 2015 | 3/25/2015

 తల్లి, పిల్ల కాంగ్రెస్ వ్యాఖ్యలతో బుధవారం అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం ఇరుకున పడింది.  టీడీపీ ఎమ్మెల్యే పార్థసారథి తల్లి-పిల్ల కాంగ్రెస్ అంటూ చేసిన వ్యాఖ్యలపై వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర అభ్యంతరం తెలిపారు. తామెన్నడూ అధికారంలో లేకున్నా ప్రతిసారి అధికార పక్ష సభ్యులు తమని ఆపాదిస్తున్నారన్నారు.

చంద్రబాబుకు మందు అధికారంలో ఉన్న కాంగ్రెస్ నేతృత్వంలోని కిరణ్ సర్కార్ కు అసెంబ్లీ సాక్షిగా మద్దతునిచ్చి ఆనాటి కాంగ్రెస్ సర్కార్‌ను నిలబెట్టిన ఘనత చంద్రబాబుదే అన్నారు. గడిచిన ఎన్నికల్లో  చంద్రబాబు నాయుడే 33 మంది కాంగ్రెస్ అభ్యర్థులకు టిక్కెట్లు ఇచ్చారని గుర్తుచేశారు.  అలాంటప్పుడు పిల్ల కాంగ్రెస్ ఎవరని వైఎస్ జగన్ ప్రశ్నించారు. వైఎస్ జగన్ సమాధానంతో టీడీపీ ఇరకాటంలో పడింది.
Share this article :

0 comments: