బాబు వచ్చాక.. పెన్షన్లలో కోత: వైఎస్ జగన్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » బాబు వచ్చాక.. పెన్షన్లలో కోత: వైఎస్ జగన్

బాబు వచ్చాక.. పెన్షన్లలో కోత: వైఎస్ జగన్

Written By news on Wednesday, March 25, 2015 | 3/25/2015


బాబు వచ్చాక.. పెన్షన్లలో కోత: వైఎస్ జగన్
హైదరాబాద్: సభను మంత్రులు పక్కదోవ పట్టిస్తున్నారని వైస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి అన్నారు. బుధవారం అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ గత బడ్జెట్లో గిరిజన సంక్షేమం కోసం రూ.1500 కోట్లు కేటాయించి కేవలం 1040 కోట్లు మాత్రమే ఖర్చుపెట్టారని, ఈ వివరాలను ప్రభుత్వమే పేర్కొందని చెప్పారు. దాదాపు రూ.500కోట్లు కోతకోశారని మండిపడ్డారు. ప్రణాళికా వ్యయం బాగా ఉంటే ఎస్సీ, ఎస్టీలకు జనాభా ప్రాతిపదికన సబ్ ప్లాన్ లో నిధులు కేటాయిస్తారని చెప్పారు. పదేళ్ల బడ్జెట్ ను పరిశీలిస్తే 34 నుంచి 35శాతం ప్రణాళిక వ్యయం ఉందని, కానీ ఈ సారి మాత్రం 23శాతానికి తగ్గించారని తెలిపారు.

దీనివల్ల ఎస్సీ, ఎస్టీలకు బాగా అన్యాయం జరిగిందన్నారు. కేటాయించిన 23శాతం నిధుల్లో కూడా రూపాయి ఖర్చు చేయలేదని, ఎస్సీలకు రూ.805 కోట్లు కోత కోశారని వివరించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా కూడా రుణాలు స్వల్ఫంగానే ఇచ్చారని తెలిపారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రూ.335 కోట్లు రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంటే ఇచ్చింది రూ.84 కోట్లు మాత్రమేనని తెలిపారు. ఎస్టీ కార్పొరేషన్ ద్వారా రూ.94 కోట్లు ఇవ్వాలని నిర్ణయించి కేవలం రూ.9 కోట్లు మాత్రమే ఇచ్చారని పేర్కొన్నారు.

ఇక బీసీలకు రూ.361 కోట్లని చెప్పి రూ.2 కోట్లు ఇచ్చారని, మైనార్టీలకు రూ.27 కోట్లు టార్గెట్ పెట్టుకొని రూపాయి కూడా ఇవ్వలేదని గుర్తు చేశారు. క్రిస్టియన్ లకు కూడా రూ.6.77కోట్లు ఇస్తామని చెప్పి ఒక్క రూపాయి విదిల్చలేదని తెలిపారు. పెన్షన్లలో కూడా అలాగే కోత కోశారని చెప్పారు. మార్చి లెక్కల ప్రకారం 37 లక్షల మందికి పెన్షన్లు ఇచ్చేందుకు రూ.402 కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పినా అవన్నీ సీఎం కార్యాలయ లెక్కలేనని అన్నారు. చంద్రబాబు రాకముందు పెన్షన్లు 43 లక్షలకు పైగా ఉండేవని తెలిపారు. కావాలనే ఆయన పాలనలో తగ్గించారని తెలిపారు. వీటన్నింటికి ముఖ్యమంత్రి సమాధానం చెప్పగలరా అని ఆయన నిలదీశారు.
Share this article :

0 comments: