ఎప్పుడు సమయం కేటాయిస్తారు: వైఎస్ జగన్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఎప్పుడు సమయం కేటాయిస్తారు: వైఎస్ జగన్

ఎప్పుడు సమయం కేటాయిస్తారు: వైఎస్ జగన్

Written By news on Wednesday, March 25, 2015 | 3/25/2015


ఎప్పుడు సమయం కేటాయిస్తారు: వైఎస్ జగన్
హైదరాబాద్ : రాజధాని ప్రాంతంలో బాధలపై శాసనసభలో చర్చ జరగకపోతే ఎలా అని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రశ్నించారు. వాయిదా అనంతరం తిరిగి ప్రారంభమైన సభలోఆయన మాట్లాడుతూ సీఆర్ డీఏ బిల్లుపై మాత్రమే గత అసెంబ్లీలో చర్చ జరిగిందన్నారు. రైతులు, కూలీ రైతులు,  కౌలు రైతుల గురించి చర్చించకుంటే ఎలా అని అన్నారు.

గత సమావేశాల్లో రైతులు, రైతుకూలీలు, కౌలు రైతుల గురించి చర్చ జరగలేదన్నారు. ఈ అంశంపై చర్చకు  ఎప్పుడు సమయం ఇస్తారో దయ ఉంచి చెప్పాలని వైఎస్ జగన్ ఈ సందర్భంగా స్పీకర్ కోడెల శివప్రసాదరావును కోరారు.   రాజధాని అంశంపై మార్చి 16, 2015న 344 కింద చర్చకు అడిగామని ఆయన తెలిపారు. అందుకు సంబంధించి జిరాక్స్ కాపీలను సభకు చూపించారు.
Share this article :

0 comments: