పీతల, జూపూడి వ్యాఖ్యలపై విద్యార్థుల నిరసన - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » పీతల, జూపూడి వ్యాఖ్యలపై విద్యార్థుల నిరసన

పీతల, జూపూడి వ్యాఖ్యలపై విద్యార్థుల నిరసన

Written By news on Tuesday, March 24, 2015 | 3/24/2015

విశాఖపట్నం : ఎస్సీ, ఎస్టీల రక్షణకోసం ఉద్దేశించిన అట్రాసిటీ చట్టాన్ని టీడీపీ నేతలు  అవహేళన చేస్తున్నారంటూ వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం, పరిశోధకులు చేపట్టిన నిరసనతో ఆంధ్రా యూనివర్సిటీ క్యాంపస్ అట్టుడికిపోయింది.

అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మంత్రి పీతల సుజాత, ఇటీవలే టీడీపీ తీర్థం పుచ్చుకున్న జూపూడి ప్రభాకర్ రావు చేసిన వ్యాఖ్యలను వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం ఖండించింది. మంత్రి సుజాత తన శాఖను పక్కకు పెట్టి ప్రతిపక్ష నేతలపై విమర్శలు చేయడంపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నాడు వైఎస్సార్ చలువతో రెండు సార్లు ఎమ్మెల్సీ పదవిని పొందిన జూపూడి.. పార్టీ మారినంతనే వైఎస్సార్సీపీపై తీవ్ర వ్యాఖ్యలకు దిగడం దుర్మార్గమన్నారు.
Share this article :

0 comments: