వైఎస్ జగన్.. రాజకీయ పునర్జన్మ ఇచ్చారు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్ జగన్.. రాజకీయ పునర్జన్మ ఇచ్చారు

వైఎస్ జగన్.. రాజకీయ పునర్జన్మ ఇచ్చారు

Written By news on Monday, March 16, 2015 | 3/16/2015


'వైఎస్ జగన్.. రాజకీయ పునర్జన్మ ఇచ్చారు'
హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తనకు మళ్లీ రాజకీయ పునర్జన్మ ఇచ్చారని ఆపార్టీ నేత పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు.  ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆయన సోమవారం ఉదయం 11 గంటలకు నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం పిల్లి సుభాష్ చంద్రబోస్ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ ప్రజా సంక్షేమంపై పోరాటానికి శాసనమండలిలో వైఎస్ఆర్ సీపీ తరపున తనవంతు పాత్ర పోషిస్తానన్నారు.

అలవికాని వాగ్దానాలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన టీడీపీని...పథకాల అమలు కోసం మండలిలో నిలదీస్తామని పిల్లి సుభాష్ చంద్రబోస్ తెలిపారు. కాగా నామినేషన్ దాఖలు కార్యక్రమంలో తూర్పుగోదావరి పార్టీ జిల్లా అధ్యక్షుడు, శాసనసభాపక్ష ఉప నేత జ్యోతుల నెహ్రూ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


కాగా ఎమ్మెల్యేల కోటాలో వైఎస్ఆర్ సీపీకి లభిస్తున్న రెండు ఎమ్మెల్సీ పదవుల్లో ఒకదానికి సుభాష్ చంద్రబోస్‌ను పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి  ఎంపిక చేసిన విషయం తెలిసిందే.  నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో మంత్రిగా ఉన్న బోస్ పార్టీ ఆవిర్భావం సమయంలోను,  ఆ తరువాత క్రియాశీలకంగా వ్యవహరించారు. మొదటినుంచీ వైఎస్ రాజశేఖరరెడ్డే తన అధిష్టానమని ప్రకటించిన ఆయన.. వైఎస్ జగన్ వెన్నంటి నిలిచారు. విశ్వసనీయతకు, విధేయతకు మారుపేరుగా నిలిచిన బోస్‌ను గౌరవించిన పార్టీ ఆయనను ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపిక చేసింది.
Share this article :

0 comments: