బాణాసంచా గోడౌన్ లో పేలుడు ఘటనపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » బాణాసంచా గోడౌన్ లో పేలుడు ఘటనపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి

బాణాసంచా గోడౌన్ లో పేలుడు ఘటనపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి

Written By news on Sunday, March 29, 2015 | 3/29/2015

విశాఖపట్నం : జిల్లాలోని ఎస్. రాయవరం మండలం గోకులపాడులోని బాణాసంచా గోడౌన్ లో పేలుడు సంభవించి ఐదుగురు మరణించిన ఘటనపై వైఎస్సార్సీసీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించడంతోపాటు మరణించిన వారి కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.

కాగా, పెద్ద మొత్తంలో బాణాసంచా నిల్వ ఉంచడమే పేలుడకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. తయారీ కేంద్రం యజమాని మడగల నానాజీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాణసంచా తయారీ కేంద్రానికి లైసెన్స్ రెన్యువల్ చేసుకున్నారా ? లేదా అన్నదానిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
Share this article :

0 comments: