సభలో మమ్మల్ని తిట్టించడమే బాబు ధ్యేయం: వైఎస్ జగన్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సభలో మమ్మల్ని తిట్టించడమే బాబు ధ్యేయం: వైఎస్ జగన్

సభలో మమ్మల్ని తిట్టించడమే బాబు ధ్యేయం: వైఎస్ జగన్

Written By news on Tuesday, March 17, 2015 | 3/17/2015


సభలో మమ్మల్ని తిట్టించడమే బాబు ధ్యేయం: వైఎస్ జగన్వీడియోకి క్లిక్ చేయండి
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి, తనను టీడీపీ నాయకులతో తిట్టించడమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ధ్యేయమని ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విమర్శించారు. అసెంబ్లీ ప్రతిపక్ష వైఖరిని వైఎస్ జగన్ తీవ్రంగా ఖండించారు. మంగళవారం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ.. సభలో చర్చ జరిగితే చంద్రబాబు అవినీతి బయటపడుతుందనే ఉద్దేశంతో కీలక అంశాలపై చర్చను అడ్డుకుంటున్నారని అన్నారు. చంద్రబాబు సభలో దివంగత నేత వైఎస్ఆర్ ను, తనను తిట్టిస్తున్నారని వైఎస్ జగన్ ఆరోపించారు. కాల్వ శ్రీనివాసులు, ధూళిపాళ్ల నరేంద్ర తదితరులు ఇదే పనిమీద ఉంటారని విమర్శించారు.
Share this article :

0 comments: