రేపు వైఎస్ జగన్ తూ.గో, విశాఖ జిల్లాల పర్యటన - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రేపు వైఎస్ జగన్ తూ.గో, విశాఖ జిల్లాల పర్యటన

రేపు వైఎస్ జగన్ తూ.గో, విశాఖ జిల్లాల పర్యటన

Written By news on Tuesday, March 31, 2015 | 3/31/2015


రేపు వైఎస్ జగన్ తూ.గో, విశాఖ జిల్లాల పర్యటనవైఎస్ జగన్ మోహన్ రెడ్డి
విశాఖపట్నం: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్ర ప్రదేశ్ శాసన సభా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు(బుధవారం) విశాఖపట్నం జిల్లాలో పర్యటించనున్నారు.  ఈ నెల 29న జరిగిన గోకులపాడు బాణాసంచా పేలుడు ఘటనలో మృతి చెందినవారి కుటుంబాలను ఆయన పరామర్శిస్తారని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్ నాథ్ చెప్పారు.

విశాఖ సెవెన్ హిల్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గాయపడినవారిని వైఎస్ జగన్ పరామర్శిస్తారు. దీంతో పాటు తూర్పు గోదావరి జిల్లాలో కూడా వైఎస్ జగన్ పర్యటించనున్నారు. గత కొన్ని రోజుల క్రితం గుండె పోటుతో మరణించిన జ్యోతిల నెహ్రూ సోదరుడు సత్యనారాయణ కుటుంబాన్ని జగన్ పరామర్శించనున్నారు.
Share this article :

0 comments: