కేంద్రంపై ఒత్తిడి తెస్తే ఈ పరిస్థితి వచ్చేదా? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కేంద్రంపై ఒత్తిడి తెస్తే ఈ పరిస్థితి వచ్చేదా?

కేంద్రంపై ఒత్తిడి తెస్తే ఈ పరిస్థితి వచ్చేదా?

Written By news on Sunday, March 1, 2015 | 3/01/2015


కేంద్రంపై ఒత్తిడి తెస్తే ఈ పరిస్థితి వచ్చేదా?
హైదరాబాద్:కేంద్ర సాధారణ బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం జరగడంపై వైఎస్సార్ సీపీ మండిపడింది. ముందుగానే కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తే ఈ పరిస్థితి వచ్చేది కాదని వైఎస్సార్ సీపీ నేత అంబటి రాంబాబు విమర్శించారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన అంబటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తీరును తప్పుబట్టారు. తొలుతే మేలుకుని ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. అంతా అయిపోయాక మొసలి కన్నీరు కారిస్తే ఏం లాభమని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు స్పెషల్ ఫైట్లపై ఉన్న శ్రద్ధ.. స్పెషల్ స్టేటస్ పై లేదన్నారు. టీడీపీ, ఎన్డీఏ ప్రభుత్వాలు కలిసి పోలవరాన్ని నీరుగారుస్తున్నాయన్నారు. విభజన చట్టంలో పోలవరానికి జాతీయ ప్రాజెక్టు హోదా లేదని వెంకయ్య నాయుడు చావు కబురు చల్లగా చెప్పారని అంబటి ఎద్దేవా చేశారు.
 
చంద్రబాబు, వెంకయ్యల రంగులు నెమ్మదిగా వెలసిపోతున్నాయన్నారు. వారిద్దరి నిజస్వరూపాలు బయటపడుతున్నాయన్నారు. పట్టిసీమకు రూ. 1300 కోట్ల నిధుల కేటాయింపు.. పోలవరాన్ని ఆపడానికే వెంకయ్య ప్రగల్భాలు తప్ప.. చేతలు శూన్యమన్నారు. చంద్రబాబుకు వ్యక్తిగత ప్రయోజనాలే ముఖ్యం కానీ, రాష్ట్ర ప్రయోజనాలు పట్టడం లేదన్నారు. ఈ 9 నెలల్లో చంద్రబాబు నేల విడిచి సాము చేయడం వల్లే రాష్ట్రానికి ఈ దుస్థితి దాపురించదన్నారు.
Share this article :

0 comments: