పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తిన వైఎస్ జగన్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తిన వైఎస్ జగన్

పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తిన వైఎస్ జగన్

Written By news on Monday, March 16, 2015 | 3/16/2015


పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తిన వైఎస్ జగన్వీడియోకి క్లిక్ చేయండి
హైదరాబాద్: పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టులపై లోతైన చర్చ జరగాలని ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శాసనసభలో అన్నారు. ఈ అంశంపై అసెంబ్లీలో ఆయన 344 నిబంధన కింద పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తారు. కీలకమైన ఈ అంశంపై మాట్లాడేందుకు తగిన సమయం ఇవ్వాలని స్పీకర్ ను కోరారు.

344  నిబంధన కింద గంట మాత్రమే చర్చ జరుగుతుందని స్పీకర్ చెప్పారు. కనీసం 2 గంటలు సమయం ఇవ్వాలని జగన్ కోరారు. ఇంతటి ప్రాధాన్యం ఉన్న అంశంపై మాట్లాడేందుకు అరగంట సమయం మాత్రమే ఇస్తామంటే ఒప్పుకోమని స్పష్టం చేశారు. ప్రతిపక్షం గళం వినాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉందన్నారు. అసెంబ్లీలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ప్రజలు గమనిస్తున్నారని వైఎస్ జగన్ అన్నారు.
Share this article :

0 comments: