రైతులను ఏడిపించిన సర్కార్‌కు మనుగడ లేదు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రైతులను ఏడిపించిన సర్కార్‌కు మనుగడ లేదు

రైతులను ఏడిపించిన సర్కార్‌కు మనుగడ లేదు

Written By news on Saturday, April 11, 2015 | 4/11/2015


రైతులను ఏడిపించిన  సర్కార్‌కు మనుగడ లేదు
  • వైఎస్సార్‌సీపీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి
బోనకల్: రైతులను కంటతడి పెట్టించిన ఏ ప్రభుత్వమూ మనుగడ సాధించలేదని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ  తెలంగాణ అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. సాగర్‌నీటి కోసం కాల్వపైకి వెళ్లిన రైతులు ఉమ్మనేనిబాబు, కళ్యాణపు శ్రీనివాసరావు, పెంట్యాల రమేష్, ఉమ్మనేని రవిలపై కేసులు పెట్టి జైలుకు పంపించిన విషయం విదితమే. తొమ్మిది రోజుల తరువాత విడుదలై  స్వగ్రామం గోవిందాపురం వచ్చినవారిని ఎంపీ శుక్రవారం పరామర్శించారు.

ఘటన తీరును అడిగి తెలుసుకున్నారు. పంటలు ఎండిపోతుంటే నీళ్లు అడిగిన రైతులపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టడం ఏమిటని, ఈ విషయమై రైతులతో వెళ్లి నీటిపారుదల సీఈ, ముఖ్యమంత్రిని కలుస్తానన్నారు.

పంట చేతికందే సమయంలో నీళ్లు అందక ఎండిపోతుంటే అధికారులను బతిమిలాడినప్పటికీ విడుదల చేయలేదనీ, పైగా అధికారులు రైతు పెంట్యాల రమేష్ చొక్కా పట్టుకుని దౌర్జన్యం చేశారని పలు వురు రైతులు ఎంపీ దృష్టికి తీసుకొచ్చారు. ఎంపీ మాట్లాడుతూ  రైతులు అధైర్యపడాల్సిన అవసరం లేదని, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతుల పక్షాన ఉద్యమం చేస్తామన్నారు.
Share this article :

0 comments: