ప్రజలే బుద్ధి చెప్పే రోజులు వస్తున్నాయి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ప్రజలే బుద్ధి చెప్పే రోజులు వస్తున్నాయి

ప్రజలే బుద్ధి చెప్పే రోజులు వస్తున్నాయి

Written By news on Thursday, April 16, 2015 | 4/16/2015


వీడియోకి క్లిక్ చేయండి
విజయవాడ : చంద్రబాబు ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెప్పే రోజులు త్వరలోనే రాబోతున్నాయని మంగళగిరి వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విజయవాడలోని ప్రకాశం బ్యారేజిని సందర్శించి అక్కడి రైతులతో మాట్లాడనున్న సందర్భంగా ముందుగానే అక్కడికి వచ్చిన ఆర్కే.. మీడియాతో మాట్లాడారు.

రైతులు, ప్రజలు ఎంత వద్దంటున్నా వినిపించుకోకుండా పట్టిసీమ ప్రాజెక్టు విషయంలో మొండిగా వెళ్తున్న ప్రభుత్వ వైఖరిని రైతులు తీవ్రంగా నిరసిస్తున్నట్లు ఆయన చెప్పారు. పట్టిసీమ ప్రాజెక్టుపై పెట్టే ఖర్చు ఏదో పోలవరం ప్రాజెక్టుపై పెడితే కాస్త ఉపయోగం ఉంటుందని, దాన్ని త్వరగా పూర్తిచేస్తే అన్ని ప్రాంతాల రైతులకు మేలు జరుగుతుందని అక్కడున్న రైతులు కూడా అభిప్రాయపడ్డారు.
Share this article :

0 comments: