సమావేశాలప్పుడే ఎమ్మెల్యే గుర్తొస్తారా - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సమావేశాలప్పుడే ఎమ్మెల్యే గుర్తొస్తారా

సమావేశాలప్పుడే ఎమ్మెల్యే గుర్తొస్తారా

Written By news on Wednesday, April 15, 2015 | 4/15/2015


సమావేశాలప్పుడే ఎమ్మెల్యే గుర్తొస్తారా
విజయనగరం : విజయనగరం జిల్లా పార్వతీ పురంలో ఐటీడీఏ సమావేశం బుధవారం ఉదయం జరిగింది. ఈ అఖిలపక్ష సమావేశంలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు అధికారపక్షాన్ని పలు సమస్యలపై నిలదీశారు. ఎమ్మెల్యే రాజన్న దొర మాట్లాడుతూ సమావేశాలప్పుడు మాత్రమే ఎమ్మెల్యే గుర్తొస్తున్నారని అధికార పక్షాన్ని విమర్శించారు. పర్నీచర్ కొనుగోలు టెండర్ల విషయాన్ని సభ్యులకు ఎందుకు తెలపలేదని ఆయన ప్రశ్నించారు. ఈ సమావేశంలో పాల్గొన్న మరో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే పి. శ్రీవాణి కూడా ప్రభుత్వ నిర్ణయాలను తప్పు పట్టారు. గిరిజన ప్రాంతాల్లో క్లస్టర్ స్కూల్ విధానంతో డ్రాప్‌అవుట్ శాతం పెరుగుతుందని ఆమె కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజుకు తెలిపారు. రాష్ట్ర మంత్రి మృణాళిని ఈ విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి గిరిజన ప్రాంతాల్లో క్లస్టర్ స్కూల్ విధానాన్ని అమలు చేయకుండా చూడాలని సూచించారు.
(పార్వతీపురం)
Share this article :

0 comments: