వెంటాడి వేటాడి చంపుతున్నారు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వెంటాడి వేటాడి చంపుతున్నారు

వెంటాడి వేటాడి చంపుతున్నారు

Written By news on Wednesday, April 29, 2015 | 4/29/2015


వెంటాడి వేటాడి చంపుతున్నారు
హైదరాబాద్:  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల వరుస దారుణ హత్యల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయా ? లేదా అన్న అనుమానం కలుగుతోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ సందేహం వ్యక్తం చేశారు. బుధవారం హైదరాబాద్ లో వాసిరెడ్డి పద్మ విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ.... వైఎస్ఆర్ సీపీ నేత భూమిరెడ్డి ప్రసాద్ రెడ్డి హత్యను ఖండించారు. చంద్రబాబు సర్కార్ దాడులను ప్రోత్సహిస్తుందని ఆరోపించారు.
వైఎస్ఆర్ సీపీ నేతలు, కార్యకర్తలను వెంటాడి వేటాడి చంపుతున్నారన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్షనేతలను అంతం చేసే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. అందుకు అధికారులు, పోలీసులు ప్రభుత్వానికి వంత పాడుతున్నారని విమర్శించారు. ఈ రోజు అనంతపురం జిల్లాలో వైఎస్ఆర్ సీపీ నేత ప్రసాదరెడ్డి హత్యకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని వాసిరెడ్డి పద్మ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
 
Share this article :

0 comments: