చంద్రబాబు చైనా యాత్ర మరో కోణం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » చంద్రబాబు చైనా యాత్ర మరో కోణం

చంద్రబాబు చైనా యాత్ర మరో కోణం

Written By news on Thursday, April 30, 2015 | 4/30/2015


చంద్రబాబు చైనా యాత్ర మరో కోణం
సందర్భం
 
అమరావతి, బీజింగ్ మధ్య రక్తచందన మార్గం నిర్మించాలని చంద్రబాబు ఆశిస్త్తుంటే, జిన్ పింగ్ బీజింగ్ ఇస్లామాబాద్ మీదుగా మధ్యధరా సముద్రానికి చేరడానికి ‘పట్టు రహదారి’ని నిర్మించే పనిలో పడ్డారు! వర్తమాన చరిత్రలో ఇంతకన్నా వైచిత్రి ఏముంటుందీ?
 
చంద్రబాబు చైనా యాత్రలో సాధించిన విజయాల గురించి మీడియాలో రంగు రంగుల కథనాలు వచ్చాయి. వస్తున్నా యి. రాష్ర్టంలో అపారంగా ఉన్న  ఎర్రచందనం నిల్వల్ని  చైనాకు అమ్మడానికి  రంగం సిధ్ధమైందనీ, అలా సమకూరే నిధులతో కొత్త రాజధాని అమ రావతి నిర్మాణం చేపడతారనేది ప్రధానాంశం. కొత్త రాజధాని నిర్మాణానికి దాదాపు ఐదు లక్షల కోట్ల రూపా యలు ఖర్చవుతుందని ఏడాదిన్నర క్రితమే చంద్రబాబు అంచనా వేశారు. ఆ నిధుల్ని తాను మిత్రపక్షంగా ఉం టున్న నరేంద్రమోదీ ప్రభుత్వం అందిస్తుందని వారు ఇన్నాళ్లూ రాష్ర్ట ప్రజల్ని నమ్మిస్తూ వచ్చారు.

నిజానికి కొత్త రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభు త్వ సహాయం, రైతుల రుణమాఫీ అనే రెండు అంశాలు చంద్రబాబు పక్షాన లేకుంటే మొన్నటి ఎన్నికల్లో ఏపీ ప్రజల తీర్పు భిన్నంగా ఉండేది. ఇప్పుడు కొత్త రాజ ధానికి కేంద్ర నిధుల వ్యవహారం కూడా అటకెక్కినట్టే కనిపిస్తోంది. అనుమానం ఉన్న వాళ్లు కేంద్ర ప్రణాళికా శాఖ మంత్రి రావు ఇంద్రజిత్ సింగ్ సాక్షాత్తు పార్లమెంటులో ఇచ్చిన  డిజిటల్ డిస్‌ప్లేను చూడవచ్చు. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశమూ లేదు. మాకు ఆ ఉద్దేశమూ లేదని వారు కుండబద్దలు కొట్టారు.
 ఇప్పుడు ఐదు లక్షల కోట్ల రూపాయలు సమకూ ర్చుకోవడానికి బాబు దగ్గరున్న ఏకైక వనరు ఎర్రచం దనం నిల్వలే. గత ఏడాది రాష్ర్ట ప్రభుత్వం గ్లోబల్ టెం డర్ల ద్వారా 4,160 టన్నుల ఎర్రచందనం దుంగలను అమ్మకానికి పెట్టినపుడు సగటున టన్నుకు 18 లక్షల రూపాయల చొప్పున మొత్తం 750  కోట్ల రూపాయల నిధులు సమకూరాయి. ఈ లెక్కన 5 లక్షల కోట్ల రూపా యల నిధుల సమీకరణకు రాష్ర్ట ప్రభుత్వం దాదాపు 30 లక్షల టన్నుల ఎర్రచందనం దుంగల్ని అంతర్జాతీయ మార్కెట్లో అమ్మాల్సి ఉంటుంది. ఇంటర్నేషనల్ యూని యన్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ సంస్థ అంతరించిపో తున్న వృక్ష సంతతిగా పేర్కొన్న ఎర్రచందనాన్ని ప్రభు త్వం ఆ స్థాయిలో అమ్మకానికి పెట్టవచ్చునా? అనేది ఇంకో సందేహం.

2012 అక్టోబర్‌లో అంతర్జాతీయ బయోడైవర్సిటీ సదస్సు హైదరాబాద్‌లో జరిగినప్పుడే ఈ అంశం ప్రముఖంగా చర్చకు వచ్చింది.  పెళుసుగా ఉండే ఎర్ర చందనం కలప ఫర్నిచర్‌కు పనికిరాదనీ, దాన్ని అణు విద్యుత్ కేంద్రాల్లో వినియోగిస్తున్నారని చైనా గుట్టు విప్పారు. ఎర్రచందనాన్ని చైనా అణు విద్యుత్ కేంద్రా ల్లోనే వినియోగిస్తోందా? లేక అణ్వాయుధాల తయారీ లోనూ వినియోగిస్తోందా? అన్నది కూడా ఎవరికైనా రావలసిన సందేహమే. దీనికి సమాధానం రెండోది కూడా అయితే చైనా అణ్వాయుధ పాటవాన్ని పెంచుకో వడంలో మనం సహితం ఎర్రచందనం పేడు ఒకటి ధారబోస్తున్నామన్న మాట.

చైనాలో చంద్రబాబు 11 ఒప్పందాలు చేసుకున్నా రనే  వార్త వచ్చిన రోజునే చైనా ప్రభుత్వం పదేళ్లుగా భారత రహస్యాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటోం దని ఒక ప్రైవేటు సెక్యూరిటీ సంస్థ వెల్లడించింది. కీలక మైన భారత వైమానిక, రక్షణ రంగాలతోపాటు పలు ప్రభుత్వరంగ సంస్థలపై చైనా ప్రభుత్వం నిఘా ఉంచిం దని ఆ సంస్థ ఓ నివేదికలో పేర్కొంది. చైనా హ్యాకర్లు ప్రభుత్వరంగ సంస్థల కంప్యూటర్లలోకి చొరబడి కీలక మైన సమాచారాన్ని సేకరిస్త్తున్నారన్నది దీని సారాంశం. భారత్‌తోపాటు దక్షిణ కొరియా, ఫిలిప్పీన్స్, వియ త్నాం, మలేసియా, నేపాల్, సింగపూర్, ఇండోనేసియా లాంటి ఆసియా దేశాలను లక్ష్యంగా చేసుకుని చైనా గూ ఢచర్యం సాగిస్తోందని ఆ సెక్యూరిటీ సంస్థ చెబుతోంది.

బాబు ఇండియా విమానం ఎక్కిన మరునాడే చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ పాకిస్తాన్ విమానం ఎక్కారు. నవాజ్ షరీఫ్‌ని ఆలింగనం చేసుకుని ‘మన స్నేహబం ధం కొండలకన్నా ఎత్తయినది, సముద్రాలకన్నా లోతై నది, తేనెకన్నా తీయనైనద’ని అన్నారు. ప్రపంచపటం మీద చైనా ఒంటరిగా ఉన్నప్పుడు బీజింగ్‌కు స్నేహ హ స్తాన్ని సాచింది ఇస్లామాబాద్ ఒక్కటేనని గుర్తు చేసుకు న్నారు. ఈ ఏడాది తన విదేశీ పర్యటనని పాకిస్తాన్‌తోనే మొదలు పెట్టానని గొప్పగా చెప్పుకున్నారు. అటు నవా జ్ షరీఫ్ కూడా జిన్ పింగ్‌కు దేశంలోనే అత్యున్నత పౌర పురస్కారమైన ‘నిషాన్-ఈ -పాకిస్తాన్’తో సత్కరిం చారు. ఇది మన భారతరత్నతో సమానం.

ఒకవైపు, సాంస్కృతిక సారూప్యత రీత్యా ఏపీ కొత్త రాజధాని అమరావతిని చైనీయులు రెండో స్వగృహంగా భావించాలని బాబు కోరి వస్తే, మరోవైపు చైనా తన దేశం నుంచి  మధ్యధరా సముద్రానికి చేరే  చారిత్రక సిల్క్ రూట్ పునరుద్ధరణకు పాకిస్తాన్‌తో ఒప్పందం చేసుకుంది.  రూ.3 లక్షల కోట్ల అంచనా వ్యయంతో చేపడుతున్న ఈ 3 వేల కిలోమీటర్ల కారిడార్ ప్రాజెక్టు వల్ల పాకిస్తాన్-చైనా మధ్య రోడ్డు లింకులు రైలు మార్గా లు, పైపులైన్లు నిర్మించనున్నారు.

అమరావతి బీజింగ్ మధ్య బాబు రక్తచందన మార్గం నిర్మించాలని ఆశిస్త్తుంటే, జిన్ పింగ్ బీజింగ్  ఇస్లామాబాద్ మీదుగా మధ్యధరా సముద్రానికి చేర డానికి ‘పట్టు రహదారి’ని నిర్మించే పనిలో పడ్డారు! వర్తమాన చరిత్రలో ఇంతకన్నా వైచిత్రి ఏముంటుందీ?
 (రచయిత సీనియర్ పాత్రికేయులు, సమాజ విశ్లేషకులు)
 మొబైల్ : 76749 99063
 - డానీ
http://www.sakshi.com/news/opinion/another-aspect-of-the-trip-to-china-on-chandrababu-234675?pfrom=home-top-story
Share this article :

0 comments: