ప్రజల కోరిక మేరకే తీర్పు వస్తుంది.. - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ప్రజల కోరిక మేరకే తీర్పు వస్తుంది..

ప్రజల కోరిక మేరకే తీర్పు వస్తుంది..

Written By news on Monday, April 13, 2015 | 4/13/2015


పార్టీని వీడిన ఎమ్మెల్యేలపై కోర్టుకెళ్లాం
- ప్రజల కోరిక మేరకే తీర్పు వస్తుంది.. రాష్ట్ర ప్రభుత్వానిది ఆర్భాటమే
- వైఎస్‌ఆర్‌సీపీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి  

వైరా: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడిన ఎమ్మెల్యేలపై కోర్టుకు వెళ్లామని, ఏ ప్రజలైతే తమకు న్యాయం చేస్తారని గెలిపించారో.. ఆ ప్రజల కోరిక ప్రకారం కోర్టు తీర్పు వస్తుందని ఆశిస్తున్నామని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షులు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆదివారం ఖమ్మం జిల్లా వైరా మండలం నారపనేనిపల్లిలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

ఆర్భాటంగా పింఛన్లు, అందరికీ పక్కా గృహాలు కట్టిస్తామని ప్రలోభాలు పలికిన ప్రభుత్వం క్షేత్ర స్థాయిలో అమలు చేయడంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందన్నారు 10 నెలల్లో పంటలు ఎండిపోయి, అప్పులు తీర్చలేక 600 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని అన్నారు. ఆత్మహత్యలు  నివారించి... రైతులకు నష్టపరిహారం అందజేయాలని పలుమార్లు విన్నవించినప్పటికీ పట్టించుకోవడం లేదన్నారు. రెండో పంట వేసుకున్న రైతులకు విద్యుత్ ఇవ్వకపోవడంతో చేసిన అప్పులు తీర్చలేక దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారన్నారు. పంట రుణాల విషయంలో కూడా 25 శాతమే మాఫీ అయిందన్నారు.

ఎన్నికల సమయంలో ప్రతి రైతుకు రూ.లక్ష  రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారని, కనీసం వచ్చే జూన్ వరకు అయినా మాఫీ చేసి కొత్త రుణాలు మంజూరు చేసి ఆదుకోవాలని డిమాండ్ చే శారు. బంగారు తెలంగాణ వస్తుందని ప్రజలు ఆశిస్తే అందుకు విరుద్ధంగా ఉందన్నారు. ఇప్పటికైనా సీఎం కేసీఆర్ ఎన్నికల హామీలను గుర్తుంచుకుని నెరవేర్చాలన్నారు. సమావేశంలో పార్టీ వైరా నియోజకవర్గ కన్వీనర్ బొర్రా రాజశేఖర్, జిల్లా కార్యదర్శులు శీలం వెంకటరామిరెడ్డి, దొడ్డపునేని రామారావు, రాష్ట్ర అధికార ప్రతినిధి ఆకుల మూర్తి, డాక్టర్స్ విభాగం జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ దరిపల్లి శ్వేత,  మండల కన్వీనర్ సూతకాని జైపాల్ తదితరులు పాల్గొన్నారు.
Share this article :

0 comments: