కర్బన ఉద్గారాల తగ్గింపునకు చర్యలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కర్బన ఉద్గారాల తగ్గింపునకు చర్యలు

కర్బన ఉద్గారాల తగ్గింపునకు చర్యలు

Written By news on Wednesday, April 29, 2015 | 4/29/2015


కర్బన ఉద్గారాల తగ్గింపునకు చర్యలు
లోక్‌సభలో పొంగులేటి ప్రశ్నకు కేంద్రం సమాధానం
న్యూఢిల్లీ: దేశంలో 1301.21 మిలియన్ టన్నుల కార్బన్ డయాకై్సడ్‌కు సమానమైన గ్రీన్‌హౌస్ ఉద్గారాలు ఉన్నాయని కేంద్ర పర్యావరణ మంత్రి ప్రకాశ్ జవదేకర్ వెల్లడించారు. ఈ అంశంపై లోక్‌సభ ప్రశ్నోత్తరాల సమయంలో వైఎస్సార్‌సీపీ తెలంగాణ అధ్యక్షుడు, ఆ పార్టీ ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అడిగిన ప్రశ్నకు ఈ మేరకు బదులిచ్చారు. మొత్తం ఉద్గారాల్లో 67 శాతం ఇంధన రంగం నుంచి, 23 శాతం వ్యవసాయ రంగం నుంచి, 6 శాతం పరిశ్రమల నుంచి, 4 శాతం వ్యర్థ రంగం నుంచి వెలువడుతున్నాయని తెలిపారు. దేశంలో ఈ ఉద్గారాలను తగ్గించేందుకు కేంద్రం పలు చర్యలు తీసుకుంటోందని వివరించారు. 1,75,000 మెగావాట్ల పునరుత్పాదక విద్యుదుత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. ఇందులో లక్ష మెగావాట్ల సౌర విద్యుత్, 60 వేల మెగావాట్ల పవన విద్యుత్ ఉన్నట్లు వివరించారు.
Share this article :

0 comments: