వైఎస్ హయాంలోనే గ్రేటర్ అభివృద్ధి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్ హయాంలోనే గ్రేటర్ అభివృద్ధి

వైఎస్ హయాంలోనే గ్రేటర్ అభివృద్ధి

Written By news on Monday, April 27, 2015 | 4/27/2015

* వైఎస్సార్ సీపీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి
* గ్రేటర్‌లోని అన్ని డివిజన్లలో పోటీ  చేస్తాం
* ఖమ్మం ఫార్ములాను అమలు చేస్తాం.. వ్యూహాత్మకంగా ఎదుర్కొంటాం
* నగర వాసుల గుండెల్లో వైఎస్సార్ చెరగని ము
ద్ర వేశారు
 
సాక్షి, హైదరాబాద్: దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే గ్రేటర్ హైదరాబాద్ నగరం విస్తృతంగా అభివృద్ధి చెందిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. వైఎస్సార్‌కు ముందు, తర్వాత పాలనను.. ఆయన పాలనను పోల్చిచూస్తే గ్రేటర్ అభివృద్ధిలో కీలకంగా వ్యవహరించినది ఎవరో స్పష్టమవుతుందన్నారు. ఆదివారం హైదరాబాద్‌లోని నారాయణగూడ వైఎంసీఏ మైదానంలో పార్టీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆదం విజయ్‌కుమార్ అధ్యక్షతన జరిగిన బహిరంగసభలో పొంగులేటి మాట్లాడారు. గ్రేటర్ హైదరాబాద్‌లో డివిజన్ల సంఖ్యను మార్చడం సీఎం కేసీఆర్ చేతుల్లో ఉందని.. డివిజన్లను 150 నుంచి 200కు పెంచినా తమ పార్టీ అన్నిచోట్లా పోటీ చేస్తుందని ఆయన పేర్కొన్నారు. గత సాధారణ ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో వైఎస్సార్‌సీపీ ఎలాంటి ఫలితాలు సాధించిందో అందరికీ తెలిసిందేనని.. అలాంటి ఫార్ములానే గ్రేటర్ ఎన్నికల్లో అమలుచేస్తామన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు సాధిస్తామన్నారు. హైదరాబాద్‌లో రోజూ ఒకచోట సభలను నిర్వహించి, పార్టీ ఉవ్వెత్తున ఎగసిపడేలా కృషి చేయాలని కార్యకర్తలకు సూచించారు.
 
 హామీలు నెరవేర్చరా?: హైదరాబాద్‌లో పేదల అభివృద్ధికి వైఎస్ ఎన్నో కార్యక్రమాలు చేశారని.. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను సీఎం కాగానే నెరవేర్చారని చెప్పారు. ఇప్పుడు సీఎంగా ఉన్న కేసీఆర్.. ఎన్నికల ముందు, ఇచ్చిన హామీల్లో ఒక్కటైనా నెరవేర్చారా? అని ప్రశ్నించారు. గ్రేటర్ ఎన్నికల ఫలితాలతో సీఎం కేసీఆర్‌కు తన పాలనపై ప్రజలు ఎలాంటి అభిప్రాయంతో ఉన్నారనే విషయం తెలిసి వస్తుందని పొంగులేటి వ్యాఖ్యానించారు. కాగా.. పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్న మైనార్టీ ప్రముఖులైన యాస్మిన్, ఇర్ఫాన్‌ఖాన్‌లతో పాటు పలువుర్ని సాదరంగా ఆహ్వానిస్తున్నామన్నారు.
 
 అనంతరం పార్టీ అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్ అభివృద్ధిపై వైఎస్సార్ చెరగని ముద్ర వేశారని, ఎయిర్‌పోర్టు, ఫ్లైఓవర్లు, రహదారులు ఆయన ఘనతేనని పేర్కొన్నారు. కేసీఆర్ హామీలన్నీ మాటలకే పరిమితమని విమర్శించారు. మైనార్టీలకు అధిక ప్రాధాన్యత ఇచ్చిన ఒకే ఒక్క సీఎం వైఎస్సార్ అని పార్టీ ప్రధాన కార్యద ర్శి మతిన్ బై  చెప్పారు. వైఎస్ పథకాలు అమలు కావాలంటే గ్రేటర్‌లో వైఎస్సార్‌సీపీ వెంట ప్రతి మైనార్టీ సోదరుడు నడవాల్సి ఉందని పేర్కొన్నారు. పార్టీ నేత రెహమాన్ మాట్లాడుతూ... సీఎం కేసీఆర్ బల్దియా ఎన్నికలంటే భయపడుతున్నారని అన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. గ్రేటర్ అభివృద్ధి ఘనత వైఎస్‌దేనని పార్టీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు  ఆదం విజయ్‌కుమార్ పేర్కొన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఒక్క సీటు కూడా గెలిచే పరిస్థితి లేదన్నారు. వికారుద్దీన్ ఎన్‌కౌంటర్ బూటకమని పార్టీ ప్రధాన కార్యదర్శి నల్లా సూర్యప్రకాశ్ ఆరోపించారు. ఈ కార్యక్రమంలో పార్టీ హైదరాబాద్ జిల్లా పరిశీలకులు గట్టు శ్రీకాంత్‌రెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి కె.శివకుమార్, పార్టీ రాష్ట్ర సేవాదళ్ అధ్యక్షుడు వెల్లాల రామ్మోహన్, సిటీ యువజన విభాగం అధ్యక్షుడు ఎ.అవినాష్‌గౌడ్, పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు బీష్వ రవీందర్, మైనార్టీ నేత మజ్‌తబ అహ్మద్, సాంస్కృతిక విభాగం నేత విజయచందర్, మహిళా నేతలు ఆర్.శ్యామల, క్రిస్టోలైట్, నస్రీన్ తదితరులు పాల్గొన్నారు.
 
Share this article :

0 comments: