రాష్ట్ర ప్రభుత్వం హామీలను విస్మరిస్తోంది.. - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రాష్ట్ర ప్రభుత్వం హామీలను విస్మరిస్తోంది..

రాష్ట్ర ప్రభుత్వం హామీలను విస్మరిస్తోంది..

Written By news on Sunday, April 12, 2015 | 4/12/2015


రాష్ట్ర ప్రభుత్వం హామీలను విస్మరిస్తోంది..
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి
 కొత్తగూడెం: రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందుకు ఇచ్చిన హామీలను విస్మరిస్తోందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.  కొత్తగూడెంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం ప్రకటనలు కేవలం మాటలకే పరిమితమవుతున్నాయని, కార్యరూపం దాల్చడం లేదని విమర్శించారు. ఇటీవల చేపట్టిన కాకతీయ మిషన్, వాటర్‌గ్రిడ్ పథకాల అమలు లోపభూయిష్టంగా ఉందన్నారు.

నిబంధనల పేరుతో అర్హులైన కాంట్రాక్టర్లను తొలగించడం సరికాదన్నారు. ఖరీఫ్ సీజన్‌లో పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ఎన్నికల హామీ మేరకు సింగరేణిలో డిస్మిస్డ్ కార్మికులను తిరిగి నియమించాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టే అభివృద్ధి పనుల వల్ల నిర్వాసితులయ్యే వారికి పునరావాసం కల్పించాలని కోరారు. సమావేశంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధికార ప్రతినిధి ఆకుల మూర్తి, రాష్ట్ర కన్వీనర్ కొదమసింహం పాండురంగాచార్యులు, జిల్లా ప్రధాన కార్యదర్శి యర్రంశెట్టి ముత్తయ్య, ఇల్లెందు నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ రవిబాబునాయక్ తదితరులు పాల్గొన్నారు.
Share this article :

0 comments: