బాబు కుట్రలో దోషులవుతున్న పోలీసులు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » బాబు కుట్రలో దోషులవుతున్న పోలీసులు

బాబు కుట్రలో దోషులవుతున్న పోలీసులు

Written By news on Thursday, April 9, 2015 | 4/09/2015


బాబు కుట్రలో దోషులవుతున్న పోలీసులు
తిరుపతి:  సీఎం చంద్రబాబు కుట్రలో పోలీసులు దోషులుగా మిగులుతున్నారని, శేషాచలం అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటరే ఇందుకు నిదర్శనమని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అన్నారు. రుయా ఆస్పత్రిలోని ప్రత్యేక వార్డులో చికిత్స పొందుతున్న పోలీసులను బుధవారం ఆయన పరామర్శించారు.

అనంతరం తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. పోలీసులకు, అటవీ సిబ్బందికే రక్షణ లేకపోతే, ప్రజలకు, ప్రకృతి సంపదకేం రక్షణ ఉంటుందన్నారు. ఈ విషయంలో అందరూ పార్టీలకతీతంగా పోలీసులకు, అటవీ సిబ్బందికి అండగా నిలవాలన్నారు.
 
Share this article :

0 comments: