Home »
» మీ రాక్షస చర్యలను అడ్డుకుంటాం
మీ రాక్షస చర్యలను అడ్డుకుంటాం
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రతిపక్షాలను చంద్రబాబు రాక్షసులతో పోల్చడంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డ అంబటి.. రాజధాని ప్రాంతంలో పచ్చని భూములను చంద్రబాబు రాక్షసుడిలా ఆక్రమించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు రాక్షస చర్యలను అడ్డుకోవడానికి ప్రతిపక్షం విష్ణుమూర్తి అవతారం ఎత్తుతోందని హెచ్చరించారు. ఏపీలో ఒక మాట.. తెలంగాణలో మరో మాట చెబుతూ బాబు ప్రజలను మభ్యపెడుతున్నారని అంబటి ఎద్దేవా చేశారు. ఒకసారి చంద్రబాబు చెప్పిన గొర్రె కథను ఆయన అన్వయించుకుంటే మంచిదన్నారు. 'మీరు ఏపార్టీలో పెరిగారు. ఏ పార్టీలో మంత్రిగా పనిచేశారు. ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారు'అంటూ అంబటి నిలదీశారు. టీడీపీ మొదటి మహానాడు సమయంలో బాబు ఎక్కుడున్నారో చెప్పాలని నిలదీశారు. విశ్వాసం గురించి చంద్రబాబు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు.
0 comments:
Post a Comment