నేటి నుంచి రెండో విడత ‘భరోసా’ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » నేటి నుంచి రెండో విడత ‘భరోసా’

నేటి నుంచి రెండో విడత ‘భరోసా’

Written By news on Monday, May 11, 2015 | 5/11/2015


నేటి నుంచి రెండో విడత ‘భరోసా’
నాలుగు నియోజకవర్గాల్లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటన
ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు పరామర్శ

సాక్షి ప్రతినిధి, అనంతపురం: కరువు దెబ్బకు పంటలు ఎండిపోయాయి... చంద్రబాబు సర్కారు చేతులెత్తేసింది... మాఫీ అవుతాయనుకున్న అప్పులు మోయలేని భారమయ్యాయి... అప్పులోళ్ల వేధింపులు తట్టుకోలేక, బ్యాంకర్ల ఒత్తిళ్లు భరించలేక, చంద్రబాబు సర్కారు చేసిన మోసం సహించలేక... అనంతపురం జిల్లాలో 66మంది రైతులు ఉసురు తీసుకున్నారు.

అయినా ప్రభుత్వాధినేత గుండె కరగలేదు. రైతు కుటుంబాలను ఆదుకోవడంలో చిత్తశుద్ధి చూపలేదు. ఆత్మహత్యలు జరగలేదన్నారు, పరిహారాన్ని పరిహాసంగా మార్చారు. సర్కారు దుర్మార్గాన్ని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శాసనసభలో నిలదీశారు. అన్నదాత కుటుంబాల్లో భరోసా నింపేందుకు రైతు భరోసాయాత్ర చేపట్టారు. తొలి విడతలో ఐదు నియోజకవర్గాల్లో పర్యటించి రైతన్నల కన్నీరు తుడిచారు. సోమవారం నుంచి నాలుగు రోజులపాటు మలి విడత రైతు భరోసా యాత్ర చేపట్టారు.

ఇందులో భాగంగా గుంతకల్లు, ఉరవకొండ, రాయదుర్గం, కళ్యాణదుర్గం నియోజకవర్గాల్లో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శించనున్నారు. అలాగే గత నెల 29న రాప్తాడు తహసీల్దార్ కార్యాలయంలో హత్యకు గురైన వైఎస్సార్‌సీపీ నాయకుడు భూమిరెడ్డి ప్రసాదరెడ్డి కుటుంబ సభ్యులను ఓదారుస్తారు. హత్య అనంతరం జరిగిన దాడుల అభియోగంతో అరెస్టయి స్థానిక సబ్‌జైల్‌లో ఉన్న వైఎస్సార్‌సీపీ నాయకులను జగన్ పరామర్శిస్తారు. మాజీ ఎమ్మెల్యే బి. గురునాథ్‌రెడ్డి, పార్టీ నాయకుడు తోపుదుర్తి చంద్రశేఖర్‌రెడ్డి, మరో 30 మంది రిమాండ్‌లో ఉన్న విషయం తెలిసిందే.

భరోసాయాత్ర షెడ్యూల్
 11వ తేదీ సోమవారం: గుంతకల్లు
 12వ తేదీ మంగళవారం: ఉరవకొండ
 13వ తేదీ బుధవారం: రాయదుర్గం
 14వ తేదీ గురువారం: కళ్యాణదుర్గం
Share this article :

0 comments: