హత్యా రాజకీయాలపై గవర్నర్‌కు ఫిర్యాదు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » హత్యా రాజకీయాలపై గవర్నర్‌కు ఫిర్యాదు

హత్యా రాజకీయాలపై గవర్నర్‌కు ఫిర్యాదు

Written By news on Sunday, May 3, 2015 | 5/03/2015


బాబు హత్యా రాజకీయాలపై గవర్నర్‌కు ఫిర్యాదు
4న నరసింహన్‌ను కలవనున్న జగన్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో టీడీపీ సాగిస్తున్న హత్యా రాజకీయాలపై వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డితో పాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలు రాష్ట్ర గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌ను కలసి ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు సోమవారం(4న) మధ్యాహ్నం 12 గంటలకు రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను వారు కలవనున్నారు. చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక గత 11 నెలలుగా రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలపై దాడులు పెరగడం...

పలువురు నేతలను దారుణంగా హతమార్చడం, రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపు తప్పిన పరిస్థితులపై వారు ఈ సందర్భంగా గవర్నర్‌కు ఫిర్యాదు చేయనున్నారు. తాజాగా అనంతపురం జిల్లా రాప్తాడు ఎమ్మార్వో కార్యాలయంలోనే వైఎస్సార్‌సీపీ నేత శివప్రసాదరెడ్డిని టీడీపీ మద్దతుదారులు దారుణంగా నరికి చంపిన ఘటన నేపథ్యంలో... రాష్ట్రంలో నానాటికీ క్షీణిస్తున్న శాంతిభద్రతల పరిస్థితిని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లి తమ వారికి రక్షణ కల్పించాలని జగన్ ఆయన్ను కోరనున్నారు.
Share this article :

0 comments: