అధైర్యపడొద్దు..అండగా ఉంటా - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » అధైర్యపడొద్దు..అండగా ఉంటా

అధైర్యపడొద్దు..అండగా ఉంటా

Written By news on Sunday, May 24, 2015 | 5/24/2015


అధైర్యపడొద్దు..అండగా ఉంటా
 వేముల :  మీకు అన్నివిధాలా అండగా ఉంటానని.. అధైర్యపడొద్దని.. ఎలాంటి ఆందోళన పెట్టుకోవద్దని వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ అధినేత, ఏపీ శాసనసభ ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మృతుని కుటుంబానికి భరోసా ఇచ్చారు. మండలంలోని తుమ్మలపల్లె గ్రామానికి చెందిన ధనికెల రఘురాం ఈనెల 18వ తేదీన తోట వద్ద విద్యుత్ షాక్‌తో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న వైఎస్ జగన్, కడప ఎంపీవైఎస్ అవినాష్‌రెడ్డి, వైఎస్‌ఆర్‌సీపీ సీజీసీ సభ్యుడు వైఎస్ వివేకానందరెడ్డిలతో కలిసి శనివారం తుమ్మలపల్లె గ్రామానికి చేరుకున్నారు. మృతుడు ధనికెల రఘురాం భార్య భారతి, తండ్రి చిన్ననారాయణలను ఓదార్చారు.

యురేనియం ప్రాజెక్టులో రఘురాం కార్మికునిగా పనిచేస్తున్నాడని..అతని మృతితో కుటుంబం జీవనాధారం కోల్పోయిందని.. ప్రాజెక్టులో ఉద్యోగం వచ్చేలా చూడాలని బంధువులు, స్థానిక నాయకులు, కుటుంబ సభ్యులు వైఎస్ జగన్‌కు విజ్ఞప్తి చేశారు. ఇందుకు స్పందించిన వైఎస్ జగన్ రఘురాం కుటుంబాన్ని ఆదుకొనేందుకు అన్ని విధాలా ముందుంటానని.. ప్రాజెక్టులో మృతుడి భార్య భారతికి ఉద్యోగం వచ్చేలా కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.

అలాగే ప్రాజెక్టులో కార్మికులుగా పనిచేస్తూ ఇప్పటివరకు ముగ్గురు మృతి చెందగా.. మరొకరు పక్షవాతంతో బాధపడుతూ ఉద్యోగం కోల్పోయారని.. ఇప్పటి కీ ఆ కుటుంబాలకు యురేనియం ప్రాజెక్టులో ఉద్యోగం ఇవ్వలేదని.. వారికి ప్రాజెక్టులో ఉద్యోగాలు వచ్చేలా చూడాలని స్థానికులు, తోటి కార్మికులు జగన్‌కు విజ్ఞప్తి చేశారు. అనంతరం మబ్బుచింతలపల్లె గ్రామానికి చెందిన వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు బొజ్జా నాగమల్లారెడ్డి, బొజ్జా శివశంకర్‌రెడ్డిలు ఇళ్లకు చేరుకొని కుటుంబ సభ్యులతో మాట్లాడారు. కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా కన్వీనర్ ఆకేపాటి అమరనాథరెడ్డి, ఆ పార్టీ మండల పరిశీలకులు లింగాల రామలింగారెడ్డి, మండల నాయకులు నాగేళ్ల సాంబశివారెడ్డి,జెడ్పీటీసీ మరకా శివకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 వైఎస్ జగన్‌కు ఘనస్వాగతం
 ముద్దనూరు : శాసనసభ ప్రతిపక్షనేత,వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డికి శనివారం తెల్లవారుజామున ముద్దనూరు రైల్వేస్టేషన్‌లో ఘనస్వాగతం లభించింది. హైదరాబాదు నుంచి వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌లో బయలుదేరిన వైయస్ జగన్, ఆయన సతీమణి భారతిరెడ్డితో కలిసి ముద్దనూరు రైల్వేస్టేషన్‌లో దిగి రోడ్డు మార్గాన పులివెందులకు బయలుదేరి వెళ్లారు. వైయస్ జగన్‌మోహన్‌రెడ్డికి ఎంపీ వైయస్ అవినాష్‌రెడ్డి ,వైఎస్సార్‌సీపీ రైతు సంఘం జిల్లా కన్వీనర్ సంబటూరు ప్రసాద్‌రెడ్డి తదితరులు స్వాగతం పలికారు.

 నేడు పులివెందులలో రైతు భరోసా యాత్ర
 పులివెందుల : వ్యవసాయ జూదంలో ఓడిపోయి.. అప్పులు తీరే మార్గంలేక.. ప్రస్తుత టీడీపీ సర్కార్ ఆదుకోక.. దిక్కుతోచని స్థితిలో బలవ న్మరణానికి పాల్పడిన రైతు కుటుంబాలను ఆదివారం ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పరామర్శించనున్నారు. పులివెందుల మండలం ఆర్.తుమ్మలపల్లెకు చెందిన కె.రామచంద్రారెడ్డి కుటుంబాన్ని , లింగాల మండలం కామసముద్రం గ్రామానికి చెందిన నాగభూషణంశ్రేష్టి కుటుంబాలన  పరామర్శించనున్నారు.
Share this article :

0 comments: