వైఎస్ జగన్ ను కలిసిన ఎన్నారై కమిటీ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్ జగన్ ను కలిసిన ఎన్నారై కమిటీ

వైఎస్ జగన్ ను కలిసిన ఎన్నారై కమిటీ

Written By news on Sunday, May 10, 2015 | 5/10/2015

హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని వైఎస్సార్సీపీ ఎన్నారై యూఎస్ఏ కమిటీ సభ్యులు కలిశారు. ఆదివారం లోటస్ పాండ్ లోని వైఎస్ జగన్ నివాసంలో ఎన్నారై  కమిటీ సభ్యులు సమావేశమయ్యారు. అక్కడ వైఎస్ జగన్ సమక్షంలో కడప మేయర్ సురేశ్ బాబుకు రూ.2.50 లక్షల చెక్కు అందజేశారు.

కడప కార్పొరేషన్ పరిధిలోని 25 ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా తగిన సదుపాయాల అందించేందుకు ఆ చెక్కు అందించినట్టు ఎన్నారై కమిటీ కన్వీనర్ రత్నాకర్ తెలిపారు. ప్రస్తుతం తాము చేసిన సాయం తొలి విడతలో భాగమేనని ఆయన చెప్పారు. భవిష్యత్ లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుకు మరిన్ని సౌకర్యాలకు సాయం చేస్తామని వైఎస్సార్సీపీ ఎన్నారై కమిటీ తరఫున కన్వీనర్ రత్నాకర్ ఈ సందర్భంగా తెలియజేశారు.
Share this article :

0 comments: