Home »
» రేపటి నుంచి వైఎస్ జగన్ భరోసా యాత్ర
రేపటి నుంచి వైఎస్ జగన్ భరోసా యాత్ర
హైదరాబాద్: అనంతపురం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం నుంచి రెండో విడత రైతు భరోసా యాత్ర నిర్వహించనున్నట్లు వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం తెలిపారు. వైఎస్ జగన్ రేపు బెంగళూరు నుంచి అనంతపురానికి చేరుకుంటారన్నారు. గుంతకల్లు, ఉరవకొండ నియోజకవర్గాల మీదగా రైతు భరోసా యాత్ర చేస్తారన్నారు. అప్పుల బాధ తాళలేక ఆత్మహత్యలు చేసుకున్న అన్నదాతల కుటుంబాలను ఆయన పరామర్శిస్తారని పేర్కొన్నారు. అనంతపురం జిల్లా జైలులో ఉన్న మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డి, తోపుదుర్తి చంద్రశేఖర్ రెడ్డి సహా 40 మంది వైఎస్సార్ సీపీ కార్యకర్తలను వైఎస్ జగన్ పరామర్శించనున్నట్లు రఘురాం తెలిపారు. ఇటీవల దారుణ హత్యకు గురైన పార్టీ నేతల ప్రసాద్ రెడ్డి కుటుంబ సభ్యులను వైఎస్ జగన్ పరామర్శించనున్నారు.
0 comments:
Post a Comment