ఆ మాటే చంద్రబాబు నోట రావడం లేదు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఆ మాటే చంద్రబాబు నోట రావడం లేదు

ఆ మాటే చంద్రబాబు నోట రావడం లేదు

Written By news on Sunday, May 24, 2015 | 5/24/2015


'ఆ మాటే చంద్రబాబు నోట రావడం లేదు'
కడప: సీఎం చంద్రబాబును మహిళలు, యువకులు తిట్టిపోస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ తెలిపారు. ఇంటికో ఉద్యోగం అన్నది బూటకంగా మారిందన్నారు. వైఎస్సార్ జిల్లా లింగాల మండలం బోనాలలో రైతు గంగాధర్ కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.... గంగాధర్ చనిపోయి 3 నెలలు అవుతున్నా అతడి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఎటువంటి సహాయం అందించలేదని విమర్శించారు. తాను పరామర్శించేందుకు వెళుతున్నానంటే హడావుడిగా నామమాత్రం సాయం చేస్తారని ఎద్దేవా చేశారు.  డ్వాక్రా మహిళల పరిస్థితి కూడా అలాగే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. రూ. 2 వేలు నిరుద్యోగ భృతి అన్న మాట చంద్రబాబు నోట రావడం లేదని వైఎస్ జగన్ ధ్వజమెత్తారు.
Share this article :

0 comments: