'రైతులకు గిట్టుబాటు ధర రావడం లేదు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » 'రైతులకు గిట్టుబాటు ధర రావడం లేదు

'రైతులకు గిట్టుబాటు ధర రావడం లేదు

Written By news on Saturday, May 16, 2015 | 5/16/2015


అనంతపురం:రైతులకు సరైన గిట్టుబాటు ధర రాకపోవడంతో వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లాలో శనివారం ఆరో రోజు రైతు భరోసా యాత్రలో భాగంగా కనేకల్ లో ధాన్యాన్ని వైఎస్ జగన్ పరిశీలించారు.  ఈ సందర్భంగా వరిపంట సాగు చేసే రైతుల  సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లాలని రైతులు జగన్ కు విన్నవించారు.

ధాన్యానికి ప్రభుత్వం రూ. 1360 మద్దతు ధర ప్రకటించినా.. కనేకల్ లో మాత్రం రూ. 1300 లోపే ధాన్యాన్ని కొనుగోలు చేయడాన్ని జగన్ తప్పుబట్టారు. ఎరువుల ధరలు అమాంత పెరిగడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. కనీసం పెట్టుబడులు సైతం గిట్టుబాటు కావకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వైఎస్ జగన్ పేర్కొన్నారు.
Share this article :

0 comments: