ప్యాపిలి : ప్యాపిలి-1 ఎంపీటీసీ సభ్యురాలు బోరెడ్డి శ్రీలత కుటుంబాన్ని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి బుధవారం రాత్రి పరామర్శించారు. పత్తికొండ బహిరంగ సభ ముగించుకుని నేరుగా ఆయన బోరెడ్డి శ్రీలత ఇంటికి చేరుకున్నారు. ఫిబ్రవరి నెల 19వ తేదీన వెల్దుర్తి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో బోరెడ్డి శ్రీలత మృతి చెందిన విషయం విదితమే. దీంతో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ముందుగా ఆయన బోరెడ్డి శ్రీలత చిత్రపటం వద్ద నివాళులర్పించారు.
అనంతరం శ్రీలత భర్త గోపీనాథ్‌రెడ్డి, మామ బోరెడ్డి శ్రీరామిరెడ్డి, అత్త పద్మావతి తదితరులను పరామర్శించారు. వారిని ఓదార్చిన జగన్ శ్రీలత కుమార్తెను దగ్గరికి తీసుకున్నారు. చిన్నారిని ఉన్నతంగా చదివించుకోవాలని సూచించారు. ఆయన వెంట డోన్ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, డోన్ నాయకులు ధర్మారం సుబ్బారెడ్డి, డోన్, ప్యాపిలి జెడ్పీటీసీలు శ్రీరాములు, దిలీప్ చక్రవర్తి, సర్పంచ్ గౌసియాబేగం, ఎమ్మెల్యే పీఏ అంకిరెడ్డి, స్థానిక నాయకులు బోరా మల్లికార్జునరెడ్డి, బోరెడ్డి రఘునాథ్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, షాషా, క్రిష్ణారెడ్డి, మెట్టు వెంకటేశ్వర్‌రెడ్డి, ప్రసాద్‌రెడ్డి, రాజా నారాయణమూర్తి, వి.శ్రీనివాసరెడ్డి, పర్వతం శ్రీనివాసరెడ్డి, తొప్పెల రమణ, బషీర్, ఎస్కే వలి, ఇమాముద్దీన్, సర్కార్ బాసా, సీబిల్లి రంగన్న, దాదు తదితరులు ఉన్నారు.
తరలి వచ్చిన జనసందోహం
ప్యాపిలి: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని చూసేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. బుధవారం డోన్ పర్యటన ముగించుకుని పత్తికొండకు వెళ్తున్న జననేతకు దారి పొడవునా ప్రజలు నీరాజనం పలికారు. ఏనుగుమర్రి గ్రామంలో ప్రజలు రోడ్డుపైకి చేరుకుని ఆయనతో కరచాలనం చేసేందుకు పోటీపడ్డారు. వారి ఆసక్తిని గమనించిన వైఎస్ జగన్ ఓపికతో వారికి అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. అనంతరం ప్యాపిలి సమీపంలో కలచట్ల బ్రిడ్జి వద్ద కూడా జనం వైఎస్ జగన్‌ను చూసేందుకు భారీగా తరలివచ్చారు. కలచట్ల, ఎస్ రంగాపురం గ్రామాల్లో జనానికి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అభివాదం చేస్తూ పత్తికొండకు వెళ్లారు.
కిక్కిరిసిన జనం
ప్యాపిలి : బోరెడ్డి శ్రీలత కుటుంబాన్ని పరామర్శించేందుకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వస్తున్నారని తెలుసుకున్న ప్రజలు రాత్రి బోరెడ్డి శ్రీరామిరెడ్డి ఇంటి వద్దకు భారీగా చేరుకున్నారు.

0 comments:
Post a Comment