వైఎస్సార్ సీపీ పోరుబాట - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్సార్ సీపీ పోరుబాట

వైఎస్సార్ సీపీ పోరుబాట

Written By news on Tuesday, May 5, 2015 | 5/05/2015

- ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కదంతొక్కిన నాయకులు, కార్యకర్తలు
- మండల కార్యాలయాల ఎదుట ధర్నాలు..ర్యాలీలు
- రెవెన్యూ అధికారులకు వినతిపత్రాల అందజేత
- టీడీపీ మేనిఫెస్టోలో హామీలను నెరవేర్చాలి, రుణ మాఫీ చేయాలని డిమాండ్
గుంటూరు సిటీ : 
 ప్రజా సమస్యలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విల్లు సంధించింది. పరిష్కారమే లక్ష్యంగా పోరుబాట పట్టింది. పార్టీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు జిల్లా పార్టీ అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ నేతృత్వంలో సోమవారం జిల్లాలోని పలు మండల కార్యాలయాల ఎదుట ఆందోళనకు శ్రీకారం చుట్టింది.

ప్రజల గోడు పట్టని పక్షంలో పతనం తప్పదని తెలుగుదేశం ప్రభుత్వానికి స్పష్టమైన హెచ్చరికలు చేసింది. ఒకే సమయంలో ఇటు కరువు, అటు అకాల వర్షాలు దాడి చేస్తున్న చిత్రమైన పరిస్థితులు జిల్లాలో నెలకొన్నాయి. అకాల వర్షాలతో జిల్లా రైతాంగం భారీగా నష్టపోగా, కరువుతో కూలీలు వలస బాట పట్టిన వాతావరణం సర్వత్రా కనిపిస్తోంది. సాగునీటి మాట దేవుడెరుగు ప్రస్తుతం తాగునీరు కూడా దక్కని దుస్థితి జిల్లా అంతటా తాండవిస్తోంది. ప్రభుత్వ పట్టనితనం, అధికారుల అలసత్వం వెరసి జిల్లా ప్రజల గోడు పట్టించుకునే నాథుడే కరువయ్యారు. ఈ నేపథ్యంలో ప్రజా సమస్యలపై వైఎస్సార్ సీపీ దృష్టి సారించింది. పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాలో రెండ్రోజుల ఆందోళనకు తెర తీసింది. మొదటి రోజులో భాగంగా పలు మండల కార్యాలయాల ఎదుట ధర్నాలు నిర్వహించి రెవెన్యూ అధికారులకు వినతిపత్రాలు సమర్పించింది.

మేడికొండూరు, ఫిరంగిపురం, బాపట్ల టౌన్, రూరల్, మంగళగిరి టౌన్, రూరల్,  క్రోసూరు, వేమూరు, చుండూరు, అమృతలూరు, తెనాలి టౌన్, రూరల్, కొల్లిపర, నర్సరావుపేట టౌన్, రూరల్, రొంపిచర్ల, చిలకలూరిపేట టౌన్, రూరల్, గురజాల, మాచవరం, నకరికల్లు, ముప్పాళ్ల తదితర మండలాల్లో సోమవారం ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ర్యాలీలు చేపట్టి రెవెన్యూ కార్యాలయాల ఎదుట ధర్నాలు నిర్వహించారు. నీటి ఎద్దడి నివారించాలనీ, వలసలు నిరోధించాలనీ, కరువు, అకాల వర్షాల ధాటికి దెబ్బతిన్న రైతాంగానికి తక్షణం నష్టపరిహారం అందించాలనీ, తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను, స్వామినాథన్ సిఫారసులను అమలు చేయాలనీ, రైతు, డ్వాక్రా రుణాలను మాఫీ చేయాలనీ, రైతులకు 9 గంటల ఉచిత విద్యుత్‌ను పగలే అందించాలనీ డిమాండ్ చేశారు.
Share this article :

0 comments: