తెలుగు ప్రజలకు ఇది దుర్దినం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » తెలుగు ప్రజలకు ఇది దుర్దినం

తెలుగు ప్రజలకు ఇది దుర్దినం

Written By news on Monday, May 25, 2015 | 5/25/2015


తెలుగు ప్రజలకు ఇది దుర్దినం
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాజధాని మాస్టర్ ప్లాన్ ను సింగపూర్ మంత్రి విడుదల చేయడం బాధాకరమని వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ అన్నారు. ఈరోజు తెలుగుప్రజలకు దుర్దినమని ఆమె వ్యాఖ్యానించారు. మాస్టర్ ప్లాన్ రూపొందించుకోలేని దీనస్థితిలో తెలుగు ప్రజలున్నారా అని ప్రశ్నించారు. పరిపాలన కూడా సింగపూర్ కో, జపాన్ కో ఇచ్చేయాలని ఎద్దేవా చేశారు.

ఇక్కడివారితో మాస్టర్ ప్లాన్ రూపొందించాల్సింది పోయి విదేశీ సంస్థలతో రూపొందించడం ఏంటని నిలదీశారు. పేరుకే అమరావతి కానీ, మేడిన్ సింగపూర్ లా తయారుచేశారని ఆమె మండిపడ్డారు. ఇంతకన్నా దౌర్భాగ్యం ఏమైనా ఉంటుందా అని వాసిరెడ్డి పద్మ నిలదీశారు. మాస్టర్ ప్లాన్ వెనుక మీ ఎజెండా ఏంటో బయటపెట్టాలని ఆమె అన్నారు.
Share this article :

0 comments: