ప్రజాస్వామ్యానికి పాతరేశారు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ప్రజాస్వామ్యానికి పాతరేశారు

ప్రజాస్వామ్యానికి పాతరేశారు

Written By news on Monday, May 4, 2015 | 5/04/2015


ఇది టీడీపీ గెలుపుకాదు..  వైఎస్సార్‌సీపీ ఓటమి కాదు
ప్రజాస్వామ్యానికి పాతరేశారు
కోట్లు పోసి పదవిని కొనుక్కొన్నారు...
వీరేం సేవ చేస్తారు
ఈ ఎన్నిక చెల్లదు..
ఎప్పటికైనా డీసీసీబీ మాదే
డీసీసీబీ ఎన్నికపై వైఎస్సార్‌సీపీ నేతల వ్యాఖ్యలు


కడప కార్పొరేషన్ : జిల్లా సెంట్రల్ కో ఆపరేటివ్ బ్యాంకు(డీసీసీబీ)ని టీడీపీ కైవసం చేసుకోవడం ఆ పార్టీకి గెలుపుకాదని, వైఎస్సార్‌సీపీకి ఓటమి కాదని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి, ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. స్థానిక వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశ ంలో ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజాభిమానంతో డీసీసీబీని వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకోగా, టీడీపీ అప్రజాస్వామికంగా వ్యవహరించి దాన్ని లాక్కుందన్నారు.

డెరైక్టర్లందరికీ డబ్బులు ఎరగా వేసి, లొంగని వారిని ఎర్రచందనం కేసుల్లో ఇరికిస్తామని భయబ్రాంతులకు గురిచేశారని ఆరోపించారు. అనేక ఆరోపణలు చేసి ఇద్దరు డెరైక్టర్లకు ఓటు హక్కు లేకుండా చేశారన్నారు. పుల్లయ్య అనే డెరైక్టర్ రెండు సంఘాలకు అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడని, తమ ఎంపీ, ఎమ్మెల్యేలు రాతమూలకంగా ఫిర్యాదు చేసినా అధికారులు కనీసం విచారణ చేసిన పాపాన పోలేదన్నారు.

శ్రీమన్నారాయణ అనే వ్యక్తి కో ఆప్షన్ పదవికి నామినేషన్ దాఖలు చేస్తే అది చెల్లదని ప్రక్కనబెట్టారన్నారు. ఇలా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేలా వ్యవహరించి డీసీసీబీ ఎన్నిక నిర్వహించారన్నారు. ఈ వ్యవహారం కోర్టులో నడుస్తున్నందున ఈ  ఎన్నిక  చెల్లదని తె లిపారు. భవిష్యత్తులో తామే డీసీసీబీని కైవసం చేసుకొంటామని విశ్వాసం వ్యక్తం చేశారు.

జిల్లాలో అప్రజాస్వామ్యం రాజ్యమేలుతోంది
  జిల్లాలో అప్రజాస్వామ్యం రాజ్యమేలుతోందని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే  రాచమల్లు ప్రసాద్‌రెడ్డి అన్నారు. ఈ ఎన్నిక ద్వారా టీడీపీ అప్రతిష్ట మూటగట్టుకోక తప్పదన్నారు. 21 మంది డీసీసీబీ డెరైక్టర్లలో టీడీపీకి చెందిన వారు ఆరుమంది, వైఎస్సార్‌సీపీకి 15 మంది డెరైక్టర్లు ఉన్నారన్నారు. సహకార వ్యవస్థలోని లొసుగులను ఆసరాగా చేసుకొని, అధికారాన్ని, డబ్బును ఆశచూపి తమ డెరైక్టర్లను వారివైపు లాక్కున్నారని ధ్వజమెత్తారు. కోట్లు పోసి డీసీసీబీ పదవిని కొనుక్కొన్నవారు ప్రజలకు, రైతులకు మేలు చేస్తారా అని సూటిగా ప్రశ్నించారు. ఈ సమావేశంలో కమలాపురం ఎమ్మెల్యే పి. రవీంద్రనాథ్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ నాయకులు జి. రాజేంద్రప్రసాద్‌రెడ్డి, ఎస్. ప్రసాద్‌రెడ్డి పాల్గొన్నారు.

ఎనిమిది మంది డెరైక్టర్లకు ధన్యవాదాలు- ఎంపీ
 అధికారం, డబ్బు ఆశచూపినా, అక్రమ కేసులు పెడతామని బెదిరించినా చెక్కు చెదరని విశ్వాసంతో పార్టీ వెంట ఉన్న 8 మంది డెరైక్టర్లకు కడప పార్లమెంటు సభ్యుడు వైఎస్ అవినాష్‌రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. వారి విశ్వాసాన్ని, నిబద్ధతను పార్టీ గుర్తుంచుకొంటుందని చెప్పారు.
Share this article :

0 comments: