సేవాదళ్‌లోకి మహిళా శక్తి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సేవాదళ్‌లోకి మహిళా శక్తి

సేవాదళ్‌లోకి మహిళా శక్తి

Written By news on Monday, May 25, 2015 | 5/25/2015

 చెన్నై : వైఎస్‌ఆర్ సేవాదళ్‌లోకి పలువురు మహిళలు చేరారు. మూడు, నాలుగు తేదీల్లో మంగళగిరి వేదికగా వైఎస్సార్ సీపీ అధినేత జగన్ మోహన్‌రెడ్డి చేపట్ట దలచిన దీక్షకు చెన్నై నుంచి అభిమానులు తరలిరావాలని ఈసందర్భంగా నాయకులు పిలుపునిచ్చారు. వైఎస్‌ఆర్ సేవాదళ్ బలోపేతం లక్ష్యంగా  ఉపాధ్యక్షుడు జకీర్ హుస్సేన్, ప్రధాన కార్యదర్శి మేడగం శ్రీనివాసరెడ్డి, అధికార ప్రతినిధి సైకం రామకృష్ణారెడ్డి ఉరకలు తీస్తున్న విషయం తెలిసిందే. విద్యార్థులను ఏకం చేయడం, సేవాదళ్‌లోకి ఆహ్వానించే పనిలో విజయవంతంగా ముందుకు సాగుతున్నారు. తాజా, మహిళా లోకం కదిలింది. సేవాదళ్‌లోకి పలువురు మహిళలు చేరారు.
 
 ఆ దళ్ సంయుక్త కార్యదర్శి ఆబోతుల శ్రీకాంత్ ఆధ్వర్యంలో హైకోర్టు మహిళా  న్యాయవాది కమలాపురం లక్ష్మీ శ్రీదేవి రెడ్డి నేతృత్వంలో పదిహేను మంది మహిళలు ఆదివారం సేవాదళ్‌లోకి చేరారు. మరో ముప్పై మంది డబ్బింగ్ ఆర్టిస్టులతో పాటుగా పలువు రు సేవాదళ్‌లోకి వచ్చారు.  అలాగే, సేవాదళ్ సేవలకు ఆకర్షితులైన ప్రముఖ కాస్మోటాలజిస్టు డాక్టర్ లత మా మలూరు తాను సైతం అంటూ ముందుకు వచ్చారు. మహిళా లోకం : ఆళ్వార్ తిరునగర్ ఎంఎల్‌పీ ఎన్‌క్లేవ్‌లో ఆదివారం సాయంత్రం సేవాదళ్ కార్యక్రమం జరిగింది. జకీర్ హుస్సేన్, మేడ గం శ్రీనివాస రెడ్డి, సైకం రామకృష్ణారెడ్డిల సమక్షంలో మహిళలతో పాటుగా మరో  ముప్పైమంది సేవాదళ్‌లోకి చేరా రు. న్యాయవాది లక్ష్మీశ్రీదేవి రెడ్డి మాట్లాడుతూ దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి మీదున్న అభిమానంతో జగనన్నను సీఎం చేయాలన్న కాంక్షతో తాను సైతం సేవల్ని అందించేందుకు ముందుకొచ్చినట్టు పేర్కొన్నారు.
 
 సేవాదళ్  బలోపేతానికి తన వంతు కృషి చేస్తానన్నారు. వైఎస్‌ఆర్‌సేవాదళ్ వేదికగా  తెలుగు వారికి న్యాయ పరంగా సేవల్ని అందించేందుకు ముందుకు సాగుతున్నాని పేర్కొన్నారు. డాక్టర్ లత మాట్లాడుతూ, రాజశేఖరరెడ్డి కుటుంబం మీద చిన్నప్పటి నుంచి తనకు అభిమానంగా పే ర్కొన్నారు. ఇక్కడి సేవాదళ్ కార్యక్రమాల్ని  పేస్ బుక్ ద్వారా తెలుసుకుని, తాను సైతం ముందుకు వచ్చినట్టు పేర్కొన్నారు. తన వంతు సేవల్ని సేవాదళ్‌కు అందిస్తామన్నారు. మేడగం శ్రీనివాసరెడ్డి, సైకం రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, జూన్ మూడు, నాలుగు తేదీల్లో మంగళగిరి వేదికగా జరగనున్న అధ్యక్షులు జగన్ మోహన్‌రెడ్డి దీక్షకు ఇక్కడి నుంచి అభిమానులు బయలు దేరనున్నామన్నారు. ఆ దీక్షకు మద్దతుగా ర్యాలీ నిర్వహించేందుకు నిర్ణయించామన్నారు.  
 
 సేవాదళ్ తరపున ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న విషయాన్ని గుర్తు చేస్తూ, త్వరలో న్యాయ పరంగా సేవల కల్పన, వైద్య పరంగా కార్యక్రమాల నిర్వహణకు చర్యలు తీసుకోనున్నామని తెలిపారు. సేవాదళ్ సంయుక్త కార్యదర్శులు ఆబోతుల శ్రీకాంత్, సిరిపురం నరేంద్ర, దర్శకుడు రోశిరాజు,  డబ్బింగ్ ఆర్టిస్టులు రవీంద్రనాథరెడ్డి, లక్ష్మి చిత్ర, డీవీ శ్రీనివాస్, ఏకరాజ్, ప్రసాద్ రాజు, మహిళ నాయకులు  రమణి,  ఎంకే లక్ష్మి, వి శైలజ, ఎస్ శ్రావణి, పాస్టర్ దేవసహాయం, ఐజాక్ ప్రేమ్‌కుమార్, సేవాదళ్ సభ్యులు కోటిరెడ్డి, సురవరపు కృష్ణారెడ్డి, సవిత వర్సిటీ విద్యార్థి నాయకుడు నరేంద్రనాథ్‌రెడ్డి, వలసరవాక్కం నాయకుడు మల్లేష్, పెద్ద ఎత్తున్న వైఎస్సార్ సేవాదళ్ నాయకులు, కార్యకర్తలు  పాల్గొన్నారు.
Share this article :

0 comments: