ధైర్యంగా ఉండండి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ధైర్యంగా ఉండండి

ధైర్యంగా ఉండండి

Written By news on Saturday, May 16, 2015 | 5/16/2015


ధైర్యంగా ఉండండి
వన్నప్ప కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ

 ఉరవకొండ : ‘కష్టాలున్నాయని అధైర్యపడొద్దు. ఇలాంటప్పుడే ధైర్యంగా ఉండాలి. పిల్లలను బాగా చదివించాల’ని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అనంతపురం జిల్లా ఉరవకొండలోని పాతపేటకు చెందిన రైతు అందెల వన్నప్ప భార్య సుశీలమ్మకు సూచించారు. రెండోవిడత రైతుభరోసా యాత్రలో భాగంగా శుక్రవారం ఆయన అప్పుల బాధతో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న రైతు వన్నప్ప కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్, వన్నప్ప భార్య సుశీలమ్మ మధ్య సంభాషణ ఇలా సాగింది.

 వైఎస్ జగన్ :  ఏం తల్లీ బాగున్నారా?
 సుశీలమ్మ:  వూకు దిక్కు లేకుండా పోరుుంది సార్.
 జగన్ :  పిల్లలు ఎంతమంది తల్లీ?
 సుశీలమ్మ: ఒక కొడుకు, ఇద్దరు ఆడ పిల్లలు.
 జగన్ : ఎన్నెకరాల పొలముంది?
 సుశీలమ్మ : రెండెకరాల సొంత పొలముంది. కౌకుంట్లలో పదెకరాలు గుత్తకు తీసుకున్నాం.
 జగన్ : పిల్లలు స్కూల్‌కు వెళుతున్నారా?
 సుశీలమ్మ : వెళ్తున్నార్ సార్. కొడుకు 6వ క్లాసు, పాప 3వ క్లాసు.
 జగన్: అప్పెంత ఉందమ్మా?
 సుశీలమ్మ : బయుట రూ.3లక్షల వరకు ఉంది. శ్రీరామ్ ఫైనాన్స్‌లో నా బంగారు చైను పెట్టి రూ.50 వేలు తీసుకొచ్చాం.
 జగన్ : ధైర్యంగా ఉండండి. పిల్లలను బాగా చదివించమ్మా..
 సుశీలమ్మ: అలాగే సార్.

 కూలికెళితే గానీ పూట గడవదయ్యా..
 వజ్రకరూరు : ‘కూలికెళితే గానీ పూట గడవడం లేదు. చాలా కష్టాల్లో ఉన్నాం సార్’ అని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వద్ద వజ్రకరూరు మండలం పందికుంట గ్రామానికి చెందిన రైతు ఓబుళేసు భార్య ఓబుళమ్మ ఆవేదన వ్యక్తం చేసింది. రైతు భరోసా యాత్రలో భాగంగా శుక్రవారం వైఎస్ జగన్ ఇటీవల అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న రైతు ఓబుళేసు కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా జగన్, ఓబుళమ్మ మధ్య సంభాషణ ఇలా సాగింది.

 జగన్ :  నీ భర్త ఎలా చనిపోయాడమ్మా ?
 ఓబుళమ్మ : అప్పుల బాధ తాళలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు సార్.
 జగన్: ఎంత భూమి ఉంది తల్లీ?
 ఓబుళమ్మ: రెండు ఎకరాల 40 సెంట్లు ఉంది సార్. దీంతో పాటు 5 ఎకరాల వరకు కౌలుకు సాగు చేశాం.
 జగన్ : డాక్రా రుణం తీసుకున్నారా?
 ఓబుళమ్మ : లేదన్నా...
 జగన్: బంగారు రుణాలు ఏమైనా తీసుకున్నారా తల్లీ?
 ఓబుళమ్మ : తినడానికే తిండి లేదు సార్. స్టోరు బియ్యమే దిక్కు. బంగారు ఎలా తెచ్చుకుంటాం సార్?!
 జగన్ : ప్రభుత్వ సాయం అందిందా.. ఎవరైనా పరామర్శించారా తల్లీ?
 ఓబుళమ్మ: ఎవ్వరూ పట్టించుకోలేదు సార్. ప్రభుత్వసాయం కోసం కార్యాలయాల చుట్టూ తిరిగాం.
 జగన్ : పిల్లలు ఏం చదువుతున్నారమ్మా?
 ఓబుళమ్మ : ఒకబ్బాయి 5వ తరగతి, ఇంకో అబ్బాయి 8వ తరగతి చదువుతున్నారు సార్.
Share this article :

0 comments: