పట్టిసీమ అంశం మీద బహిరంగ చర్చకు చంద్రబాబు సిద్ధమా - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » పట్టిసీమ అంశం మీద బహిరంగ చర్చకు చంద్రబాబు సిద్ధమా

పట్టిసీమ అంశం మీద బహిరంగ చర్చకు చంద్రబాబు సిద్ధమా

Written By news on Saturday, May 9, 2015 | 5/09/2015


చంద్రబాబు  అక్రమ సంతానం పట్టిసీమ
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్

పాతగుంటూరు : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మెదడుకు పుట్టిన అక్రమ బిడ్డే పట్టిసీమ ప్రాజెక్టు అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ విమర్శించారు. జిల్లా పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పట్టిసీమ ప్రాజెక్టుకు రూ.300 కోట్ల నుంచి రూ.500 కోట్ల వరకు కమీషన్ తీసుకోవడానికే పట్టిసీమ జపం చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు గతంలో 1995 నుంచి 2004 వరకు ముఖ్యమంత్రిగా ఉండగా 10 టీఎంసీల ప్రాజెక్టు ఒక్కటి కూడా కట్టింది లేదన్నారు.

పట్టిసీమ ఆలోచన చంద్రబాబుకు 2014 ఎన్నికల సమయంలో కూడా రాలేదన్నారు.  పట్టిసీమ కడితే రాయలసీమకు నీళ్లు వస్తాయని, 1000 టీఎంసీల నీరు తరలించవచ్చని, 2 కోట్ల ఎకరాలకు నీరు అందించవచ్చని, కృష్ణా డెల్టాకు గోదావరి నీరు అందుతుందంటూ చంద్రబాబు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని రాజశేఖర్ మండిపడ్డారు.

చంద్రబాబునాయుడు అబద్ధాలకు అడ్డు అదుపు లేకుండా పోయిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.  పట్టిసీమ అంశం మీద బహిరంగ చర్చకు చంద్రబాబు సిద్ధమా అంటూ రాజశేఖర్ సవాలు విసిరారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్ విభాగం జిల్లా అధ్యక్షుడు సాయిబాబా, జిల్లా అధికార ప్రతినిధి శిఖా బెనర్జీ తదితరులు పాల్గొన్నారు.
Share this article :

0 comments: