ఎన్నికలు వస్తే టీడీపీ గల్లంతు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఎన్నికలు వస్తే టీడీపీ గల్లంతు

ఎన్నికలు వస్తే టీడీపీ గల్లంతు

Written By news on Sunday, May 10, 2015 | 5/10/2015

ఆత్మకూరు: రాష్ట్రంలో ఎన్నికలు వస్తే టీడీపీ గల్లంతవుతుందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి అన్నారు. పట్టణంలోని కొత్తబస్టాండ్ వద్ద ఆర్టీసీ కార్మికులు నిర్వహించిన రాస్తారోకోలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఎన్నికల సమయంలో తప్పుడు హామీలిచ్చి పదవి చేపట్టిన టీడీపీ ప్రజా సంక్షేమ పథకాలను విస్మరించిందన్నారు. ప్రస్తుతం ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె న్యాయ సమ్మతమైనదన్నారు.

వీరి సమ్మెకు తమ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పూర్తి మద్దతు ప్రకటించారని తెలిపారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఇప్పటివరకు రూ.800 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని చెప్పారు. ఆయన తనతోపాటు కుమారుడు లోకేష్‌ను కూడా విదేశాలకు పంపడం గర్హనీయమన్నారు.

రుణమాఫీ పేరుతో రైతులను, డ్వాక్రా మహిళలను మోసం చేశారని విమర్శించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ జిల్లా అధికార ప్రతినిధి పాండురంగ చౌదరి, జయకృష్ణ, నాగూర్, యుగంధర్‌రెడ్డి, రామ్మూర్తి, నాగార్జునరెడ్డి, షాబుద్దీన్, సయ్యద్‌మీర్, కురుకుంద మల్లికార్జునరెడ్డి, షాలుఫైల్మాన్, పవన్  పాల్గొన్నారు. 
Share this article :

0 comments: