బాబును ఏ-1గా చేర్చాలి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » బాబును ఏ-1గా చేర్చాలి

బాబును ఏ-1గా చేర్చాలి

Written By news on Saturday, June 13, 2015 | 6/13/2015


బాబును ఏ-1గా చేర్చాలి
పులివెందుల : ఓటుకు నోటు వ్యవహారంలో అసలు సూత్రధారి చంద్రబాబును ఏ-1 ముద్దాయిగా కేసు నమోదు చేయాలని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం సాయంత్రం శాసనసభలో విపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ కేసీఆర్‌పైన, మరొకరిపైన అవాకులు.. చవాకులు పేలుతున్న చంద్రబాబు రేవంత్‌రెడ్డి విషయంలో ఎందుకు నోరు మెదపడంలేదన్నారు. రేవంత్‌రెడ్డి వీడియో క్లిప్పింగ్‌లో చాలా స్పష్టంగా తన బాస్ చంద్రబాబు పంపితేనే వచ్చానని ఎమ్మెల్యే స్టీఫెన్ సన్‌తో చెప్పడం  దేశ ప్రజలందరూ చూశారన్నారు.

తన ఫోన్ ట్యాపింగ్ చేశారని చెబుతున్న చంద్రబాబు స్టీఫెన్ సన్‌తో ఫోన్‌లో మాట్లాడిన విషయాన్ని ఎందుకు ఖండించలేదన్నారు. తన సొంత అవినీతి వ్యవహారాన్ని రెండు రాష్ట్రాల ప్రజల వివాదంగా చిత్రీకరించడం ఆయన మూర్ఖత్వానికి నిదర్శనమన్నారు. చంద్రబాబు వ్యవహారంలో ఏసీబీ నిష్పక్షపాతంగా విచారణ జరపాలని ఆయన కోరారు.

ఈ కేసు నుంచి బయటపడేందుకు చంద్రబాబు ఢిల్లీ పెద్దల చుట్టూ ప్రదక్షిణ చేస్తూ తనను కాపాడాలని వేడుకుంటున్నారన్నారు. ప్రధానమంత్రి తనకు హామీ ఇచ్చారని.. తనకు అనుకూలమైన మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారన్నారు. ఇంత బహిరంగంగా చంద్రబాబు అవినీతికి పాల్పడుతుంటే.. ఆయన మీద ఎందుకు కేసు నమోదు చేయలేదని ప్రశ్నించారు. ఇప్పటికే చంద్రబాబు అవినీతిపై రాష్ట్రపతితో పాటు ఇతర కేంద్ర మంత్రులకు వైఎస్ జగనన్న సారథ్యంలో వైఎస్‌ఆర్ సీపీ తరపున వినతిపత్రాలు అందజేసి చంద్రబాబును ఏ-1 ముద్దాయిగా చేర్చాలని పార్టీ ఎంపీలతో కలిసి డిమాండ్ చేశామన్నారు. ప్రజాస్వామ్యంపై చంద్రబాబుకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా తన పదవికి రాజీనామా చేసి నిజాయితీ నిరూపించుకోవాలన్నారు.

 సమస్యల పరిష్కారానికి కృషి
 ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. తన వద్దకు వచ్చిన ప్రజల సమస్యలను ఓపికగా విన్న ఆయన పరిష్కారానికి అధికారులకు ఫోన్లు చేశారు. పులివెందుల జెడ్పీటీసీ వెంగముని, తొండూరు ఎంపీపీ భర్త రవీంద్రనాథరెడ్డి సమస్యలను ఆయన దృష్టికి తేగా వాటిని పరిష్కరించారు.
Share this article :

0 comments: