వచ్చే నెల 2న తూర్పుగోదావరి పర్యటనకు వైఎస్ జగన్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వచ్చే నెల 2న తూర్పుగోదావరి పర్యటనకు వైఎస్ జగన్

వచ్చే నెల 2న తూర్పుగోదావరి పర్యటనకు వైఎస్ జగన్

Written By news on Monday, June 29, 2015 | 6/29/2015

హైదరాబాద్: వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వచ్చే నెల 2న తూర్పుగోదావరి జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు. తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా వైఎస్ జగన్ తొలుత రాజమండ్రికి రానున్నారు.

ఏజెన్సీలో ఇటీవల జరిగిన వ్యాన్ ప్రమాద బాధితులను వైఎస్ జగన్ పరామర్శించనున్నారు. అనంతరం కాకినాడకు వెళ్లి మత్స్యకార కుటుంబాలను కలుస్తారు. 3వ తేదీ వైఎస్ జగన్ విశాఖపట్నం జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు. ఇటీవల ధవళేశ్వరం వద్ద జరిగిన ప్రమాదంలో మరణించినవారి కుటుంబసభ్యులను అచ్యుతాపురంలో వైఎస్ జగన్ పరామర్శించనున్నారు.
Share this article :

0 comments: