చంద్రబాబు ఆడియో టేపులు బహిర్గతం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » చంద్రబాబు ఆడియో టేపులు బహిర్గతం

చంద్రబాబు ఆడియో టేపులు బహిర్గతం

Written By news on Sunday, June 7, 2015 | 6/07/2015


చంద్రబాబు ఆడియో టేపులు బహిర్గతంవీడియోకి క్లిక్ చేయండి
హైదరాబాద్: నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫన్సన్ కు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ముడుపులు ఇవ్వజూపిన వ్యవహారంలో ఆ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడిన ఆడియో టేపులు తాజాగా బహిర్గతం అయ్యాయి. తమ పార్టీ ఎమ్మెల్యేలు చెప్పిన దాన్ని తాను తప్పకుండా నెరవేరుస్తానని స్టీఫెన్సన్ కు చంద్రబాబు ఇచ్చిన హామీలు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఏసీబీ అధికారులు చంద్రబాబుకు ఏ క్షణంలోనూనా నోటీసులు జారీ చేసే అవకాశం కనబడుతోంది.

స్టీఫెన్సన్ తో చంద్రబాబు సంభాషణ ఈ విధంగా సాగింది..


చంద్రబాబు తరపు మనిషి:హలో బ్రదర్.. బాబుగారు మీతో మాట్లాడతారు.. లైన్ లో ఉండండి
ఎమ్మెల్యే స్టీఫెన్సన్: సార్.. గుడ్ ఈవెనింగ్ సార్
చంద్రబాబు:గుడ్ ఈవెనింగ్ బ్రదర్.. హౌ ఆర్ యూ
స్టీఫెన్సన్: ఫైన్.. థాంక్యూ సర్
చంద్రబాబు:మనవాళ్లు నాకంతా వివరించారు.. మీకు అండగా నేనుంటా.. కంగారు పడాల్సిందేమీ లేదు
స్టీఫెన్సన్:యస్ సార్.. రైట్ సార్
చంద్రబాబు:అన్నింటికీ మీకు నేను అండగా ఉంటా.. వాళ్లు మీతో మాట్లాడినవన్నీ నెరవేరుస్తాం
స్టీఫెన్సన్:యస్ సార్.. రైట్ సార్
చంద్రబాబు:మీరు స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోండి.. ఎలాంటి సమస్య లేదు
స్టీఫెన్సన్:ఒకే సార్
చంద్రబాబు:అది మా హామీ.. మనం కలిసి పనిచేద్దాం
స్టీఫెన్సన్:రైట్.. థాంక్యూ సార్..
చంద్రబాబు:థాంక్యూ
Share this article :

0 comments: